Senior leaders satires on hema malini

actress hema malini news, Mp Hema malini news, hema malini madhura division, hema malini parliament, hema malini amercia tour, hema malini dance tour, hema malini twitter news, hema malini movies, hema malini photos, mp hema malini parliament, hema malini comments, hema malini press meet

senior leaders satires on hema malini : actress and MP hema malini return from america tour after two months and creates new controversies in her division and parliament which goes viral

‘‘శెభాష్’’ హేమమాలిని.. కరెక్ట్ గా చెప్పారు..?

Posted: 08/04/2014 11:58 AM IST
Senior leaders satires on hema malini

ప్రస్తుతమున్న రాజకీయాల్లో సీనియర్ నాయకుల కంటే సెలబ్రిటీలదే ఎక్కువ హవా నడుస్తోందని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ఇటీవలే జరిగిన సార్వత్రిక ఎన్నకల్లో ఎవరైతే పోటీల్లో పాల్గొన్నారో వారందరూ సదరు నియోజకవర్గంలో వున్న సీనియర్ అధికారుల కంటే తమ ఛరిష్మాతో ఎక్కువ మెజారిటీతో గెలుపొందారు. ఈ జాబితాలో చాలామంది సెలబ్రిటీలే వున్నారు. అందులో ఇప్పుడు ముఖ్యంగా చర్చించుకోవాల్సింది ‘‘హేమమాలిని’’ గురించి!!!

ప్రముఖ తార హేమమాలిని మధుర నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సంగతి విదితమే! అక్కడి ప్రజలు ఈమె మీదున్న నమ్మకంతో భారీ మెజారిటీతో ఆమెను గెలిపించారు. ఎన్నికల్లో అంతటి భారీ విజయాన్ని సంపాదించిపెట్టిన ప్రజలకు కూడా ఈమె థ్యాంక్స్ చెప్పుకుంది. ఆరోజంతా సంతోషంతో ఉప్పొంగిపోయి ప్రజల మధ్యలోనే కాలం గడిపింది. కానీ ఆరోజు తరువాత ఆమె దాదాపు రెండు నెలలవరకు పత్తా లేకుండా పోయారు. తన సొంత నియోజకవర్గానికే కాదు.. పార్లమెంటుకు సైతం ఆమె హాజరు కాలేదు. దీంతో ‘‘హేమమాలిని’’ కనిపించడం లేదంటూ ఆమె నియోజకవర్గ స్థానికులు పోస్టరు కూడా అతికించి, ప్రచారాలు చేసుకున్నారు.

అయినా ఫలితం లేకుండా పోయింది. ఆమె మాత్రం అస్సలు కనిపించలేదు. అయితే.. ఏమైందో ఏమో తెలియదు కానీ.. హఠాత్తుగా ఒకరోజు హేమమాలిని తన మధుర నియోజకవర్గానికి వెళ్లారు. దీంతో అక్కడి ప్రజలు ఆమెను చూసి ఒక్కసారిగా షాక్ తిన్నారు. ‘‘ఇదేంటి..? ఈమె కనిపించకుండా పోయింది కదా! ఎలా తిరిగొచ్చింది..?’’ అంటూ మొదట్లో సెటైర్లు కూడా వేసుకున్నారు. అందరూ ఒక్కొక్కరుగా సెటైర్లు వేయడం చూసి.. హేమమాలిని పెదవి విప్పారు. ‘‘నేను మొదట చేసుకున్న ఒప్పందం ప్రకారం రెండు నెలలు అమెరికాకు వెళ్లాల్సి వచ్చింది’’ అని ఆమె పేర్కొన్నారు. ఎలాగైనా ఆమె తన స్థానికుల్ని శాంతింపచేయాలనే ప్రయత్నంలో పూర్తిగా మునిగిపోయారు. డ్యాన్స్ టూర్ నిమిత్తం రెండునెలల వరకు అమెరికాలోనే వుండాల్సి వచ్చిందని ఆమె స్పష్టం చేశారు.

ఇదిలావుండగా... హేమమాలిని పార్లమెంటుకు కూడా హాజరు కాకపోవడంతో అక్కడి సభ్యులు ఈమెపై పెదవి విరిచారు. ‘‘పార్లమెంటుకు అయితే ఫర్వాలేదు కానీ.. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు సొంత నియోజకవర్గంలో కూడా వుండకపోతే ఎలా..?’’ అని ప్రశ్నించడం మొదలుపెట్టారు. దాంతో కోపగించుకున్న హేమమాలిని.. ‘‘ప్రజల సమస్యల్ని పరిష్కరించేందుకు సొంత నియోజకవర్గంలో వుండాల్సిన అవసరం లేదు’’ అని తేల్చి చెప్పింది. దీంతో కొంతమంది సీనియర్ నాయకులు షాక్ తిని.. ‘‘శెభాష్ హేమమాలిని..? చాలా కరెక్ట్ గా చెప్పావమ్మా..??’’ అంటూ సెటైర్లు వేసుకున్నారు. ఇదే మాటను ఎన్నికల సమయంలో చెప్పి వుంటే.. నీ పరిస్థితి ఇలా వుండేది కాదంటూ.. అందరూ ఇష్టమొచ్చినట్లుగా సెటైర్లు వేసుకున్నారని సమాచారం!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles