(Image source from: Madhya pradesh high court fires on digvijay singhs letter)
కాంగ్రెస్ పార్టీ అధికారంలో వున్నంతకాలం ఓ ఊపు ఊపిన ఆ పార్టీ సీనియర్ దిగ్విజయ్ సింగ్ కు ఇప్పుడు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. పార్టీ ఘోరంగా పరాజయం పాలవ్వడంతో కొన్నాళ్లపాటు అడ్రస్ లేకుండా పారిపోయిన ఈ ముసలాయన... ఇప్పుడు మీడియాముందు అనవసరంగా రాజకీయ వేశాలేస్తూ మొటిక్కాయలు తింటున్నాడని కొంతమంది రాజకీయ విశ్లేషకులు తీవ్రంగా విమర్శిస్తున్నారు.
ఎన్నడూలేని విధంగా ‘‘నేను రైతుల కోసం ఒక వారంరోజులపాటు నిరాహార దీక్ష చేస్తున్నాను’’ అని ట్విటర్ ద్వారా తెలిపిన డిగ్గీరాజా... అప్పటికప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయారు. ఇన్నాళ్లూ ఎక్కడికి పోయాడో తెలియదుకానీ... రాజకీయపరంగా కామెంట్లు చేస్తూ మీడియాకంట పడటంతో రాజకీయ నాయకులు ఒక్కసారిగా ఖంగుతిన్నట్లు చెప్పుకున్నారు. డిగ్గీరాజాకు ముసలివయస్సులో ఇదేం పోయేకాలంరా బాబు అంటూ.. కొంతమంది కామెంట్లు కూడా చేసుకున్నారు.
అయితే ఇదంతా నిన్నటి కథ! ఇప్పుడు తాజాగా ఆయనకు కోలుకోలేనంత భారీ దెబ్బ పడింది. మధ్యప్రదేశ్ ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్ బోర్డు (ఎంపీపీఈ) కుంభకోణంలో సీబీఐ దర్యాప్తు జరిపించాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను ఆ రాష్ట్ర హైకోర్టు ఆయనకే తిప్పి కొట్టింది. ‘‘రాజకీయ రణరంగాలను న్యాయస్థానాలకు లాగడానికి ఇదేమీ మీ అడ్డాకాదు’’ అన్న రీతిలో ఆయనకు చెంప ఛళ్లమనేలా జవాబిచ్చింది.
‘‘ఒక విషయం మీద కోర్టుకు లేఖ రాయడం తప్పుడు సంప్రదాయానికి దారి తీస్తుంది. న్యాయస్థానాలు కేవలం అధికారికంగా వున్న నిర్దిష్ట ప్రక్రియలను మాత్రమే అనుసరిస్తాయి. ఆ రీతిలో అందరూ వ్యవహరించాలి. న్యాయప్రక్రియను అనుసరిస్తూ పిటిషన్ దాఖలు చేయడం నేర్చుకోండి’’ అంటూ కోర్టు ప్రధాన న్యాయమూర్తులయిన జస్టిస్ ఏ.ఎం.ఖాన్ విల్కర్, జస్టిస్ అలోక్ అరాధేతో కూడిన ధర్మాసనం దిగ్విజయ్ సింగ్ కు ఆదేశించింది.
రాష్ట్రప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తులో లోపాలు వున్నాయని, అందులో కుంభకోణాలు జరుగుతున్నాయని... దానికోసం సీబీఐ దర్యాప్తు ఖచ్చితంగా జరపించాల్సిందిగా కోరుతూ దిగ్విజయ్ సింగ్ న్యాయస్థానానికి ఒక లేఖ సమర్పించుకున్నారు. ఆ లేఖనే పిటిషన్ గా భావించాలని అందులో పేర్కొన్నారు. దీంతో హైకోర్టు ఆయన మీద పై విధంగా మండిపడింది. ‘‘రాజకీయాల్లో ఇన్నాళ్లవరకు అనుభవం వున్నా... కనీసం జ్ఞానం లేకుండా ఇలా కోర్టుకు ఎవరైనా లేఖ రాస్తారా’’ అని కొంతమంది నాయకులు ఆయన మీద తీవ్రంగా ఆరోపించారు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more