Telangana court shocks to cm kcr

telangana court shocks to cm kcr, telangana court, andhra pradesh high court latest news, andhra pradesh high court, telangana high court, cm kcr latest news, cm kcr news, apngo empty places, apngo president ashok babu latest news, telangana court shocks cm kcr, cm kcr shocks with telangana court orders

telangana court shocks to cm kcr

కేసీఆర్ కు షాకిచ్చిన తెలంగాణ కోర్టు

Posted: 07/08/2014 11:48 AM IST
Telangana court shocks to cm kcr

(Image source from: telangana court shocks to cm kcr)

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ కు.. ఆ రాష్ట్ర కోర్టు ఆయనకు షాకిచ్చింది. మొన్నటివరకు కొత్త విధానాలను అనుసరించి, అందరికీ షాకిచ్చిన సీఎం కేసీఆర్ కు... ఇప్పుడు ఎదురుదెబ్బ పడింది. కేసీఆర్ ఆదేశాల మేరకు హైదరాబాద్ లో నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చేయడం ప్రారంభించిన విషయం తెలిసిందే!

అలాగే హైదరాబాద్ లోని శేరిలింగంపల్లి సమీపంలోని గోపన్ పల్లిలో ఏపీఎన్జీవోలకు సంబంధించిన 189 ఎకరాల ఖాళీ భూములను వెనక్కు తీసుకోవాల్సిందిగా ఆయన ఆదేశించారు. ఈ విషయంపై గత కొద్దిరోజుల నుంచి వివాదం జరుగుతూనే వుంది. దీనిమీద చాలావరకు మంత్రులు తమ అభిప్రాయాలను కూడా తెలిపారు. ఏపీఎన్జీవోల భూములను తిరిగి తీసుకోవడం మంచి నిర్ణయం కాదని ఏపీ మంత్రులు కేసీఆర్ మీద గుర్రుగా కామెంట్లు కూడా చేశారు.

2004వ సంవత్సరంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా వున్న సమయంలో ఏపీఎన్జీవోలకు 189 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. అయితే ఆ స్థలాల్లో ఎటువంటి నిర్మాణాలు జరగకపోవడంతో అవి ఖాళీగానే మిగిలి వున్నాయి. దాంతో ఆ స్థలాలను తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ‘‘ఏపీఎన్జీవోలకు కేటాయించిన భూములను అక్రమంగా ఇతరులకు అమ్ముకుంటారనే ఈ స్థలాలను స్వాధీనం చేసుకోవాల్సి వచ్చింది’’ అని తెలంగాణ ప్రభుత్వం అప్పట్లో ప్రకటనలు కూడా చేసింది.

apngo-members

ఇదంతా గతంలో జరిగిన తతంగం...! ఇప్పుడు తాజాగా ఈ విషయం మీద రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఏపీఎన్జీవోలకు కేటాయించిన స్థలాలను యథాతథాస్థితిని కొనసాగించాలని పేర్కొంటూ తెలంగాణ ప్రభుత్వానికి షాక్ తగిలేలా ఆదేశాలు జారీ చేసింది. దీనిపై నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని కూడా కోర్టు పేర్కొంది.

అయితే తెలంగాణ ప్రభుత్వం జారీచ చేసిన ఆదేశాలమేరకు రాజేంద్రనగర్ ఆర్డీవో సురేష్ ఒడ్డార్, శేరిలింగంపల్లి తహశీల్దార్ విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఈ భూముల ఆవరణ చుట్టూ ప్రభుత్వ బోర్డు పెట్టారు. ఈ విధంగా ఈ బోర్డు పెట్టడంపై ఆగ్రహించిన కోర్టు.. దీనిపై వివరణ ఇవ్వాలని కోరుతూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో కేసీఆర్ ప్రభుత్వానికి గట్టి షాక్ తగిలినట్టయ్యింది. ఈ విషయం మీద స్పందించిన ఏపీఎన్జీవోల అధ్యక్షుడు అశోక్ బాబు హర్షం వ్యక్తం చేశారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles