Anil ambani met with telangana cm kcr

Anil Ambani met with telangana cm kcr, anil ambani latest news, anil ambani news, anil ambani with cm kcr, anil ambani meeting with cm kcr, cm kcr with anil ambani, anil ambani and cm kcr news, anil ambani and mukesh ambani

Anil Ambani met with telangana cm kcr

తెలంగాణాను నా చేతిలో పెట్టండి : అంబానీ

Posted: 07/08/2014 10:43 AM IST
Anil ambani met with telangana cm kcr

(Image source from: Anil Ambani met with telangana cm kcr)

తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో కేసీఆర్ ప్రభుత్వం అన్నీ ఏర్పాట్లకు రంగం సిద్ధం చేస్తోంది. చాలా త్వరలోనే హైదరాబాద్ సిటీ ప్రపంచపటంలో ఒక ప్రముఖ పట్టణంగా పేరు సంపాదించనుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే! ఇందుకు సంబంధించిన కొన్ని పనులను కూడా అప్పుడే ప్రారంభించేశారు కూడా!

తాజాగా ఇందులో నేను కూడా భాగం పంచుకుంటానంటూ ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన అనిల్ అంబానీ ముందుకు వస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో తనవంతు సహాయం అందిస్తానంటూ ఆయన తెలిపారు. సోమవారంనాడు హైదరాబాద్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ తో సమావేశమైన రిలయన్స్ అడాగ్ ఛైర్మన్ అనిల్ అంబానీ... తెలంగాణాలో విద్యుత్, మౌలిక సదుపాయాలు, పారిశ్రామీకీకరణ, మీడియా రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి చేయూతనందిస్తామని ఆయన స్పష్టం చేసినట్టు తెలిపారు.

మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి సంస్థలో భేటీ అయిన వీరిద్దరూ... పై విషయాల మీద సుదీర్ఘంగా చర్చించినట్టు తెలిసింది. తెలంగాణ రాష్ట్ర తొలిముఖ్యమంత్రి అయిన కేసీఆర్ కు అనిల్ అంబానీ అభినంచినట్టు సీఎం కార్యాలయం నుంచి విడుదలైన ఓ ప్రకటన ఈ విధంగా పేర్కొంది. అలాగే.. ఏ విధంగా అయితే తన తండ్రి కిందిస్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారి అయ్యాడో... అదేవిధంగా కేసీఆర్ కూడా తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తారంటూ అనిల్ అంబానీ అభిప్రాయపడినట్టు తెలిపింది.

వీరిద్దరూ భేటీ అయిన ఈ సమావేవంలో... నూతన పెట్టుబడులతో తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు సమగ్ర ప్రణాళికలను సిద్ధం చేస్తున్న పేర్కొన్నారు. కొత్త పారిశ్రామికలు నిర్మించిన అనంతరం.. తదుపరి కార్యకలాపాలపై చర్చించేందుకు ముందుకెళ్లే కార్యాచరణలను రూపొందించుకుందామని ఇద్దరూ నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఐటీ, పంచాయతీరాజ్ శాఖమంత్రి కేటీఆర్, ప్రభుత్వ ప్రధార కార్యదర్శి రాజీశర్మ కూడా పాల్గొన్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles