No police verification in case of passport renewal

No police verification in case of passport renewal, passport renewal, Passport, No police verification, passport officer

No police verification in case of passport renewal, Passport delivery to become hassle-free,

పాస్ పోర్టు రెన్యూవల్ బంద్ !

Posted: 07/04/2014 03:27 PM IST
No police verification in case of passport renewal

ఇక నుండి పాస్ పోర్టు రెన్యూవల్ , పోలీస్ వెరిఫికేషన్ బంద్ కాబోతున్నాయి. అంటే పాస్ పోర్టు తీసుకోవటం అంటే చాలా కష్టంతో కూడుకున్న పని. ఆ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకోవటానికి సిద్దమవుతుంది. ఇక భవిష్యత్తులో పాస్ పోర్టు సేవలు చాలా సులవుతున్నాయి. దీంతో పాటు త్వరగా పాస్ పోర్టు పొందేలా కూడా చర్యలు చేపట్టారు అధికారులు. చీఫ్ పాస్ పోర్టు ఆఫీసర్ సూచనలతో కొత్తగా పాస్ పోర్టు రెన్యూవల్ కు పోలీస్ వెరిఫికేషన్ బంద్ అయ్యే అవకాశం ఉంది. దీని గురించి విదేశాంగ మంత్రిత్వ శాఖ పాస్ పోర్ట్ రెన్యూవల్ కు పోలీస్ వెరిఫికేషన్ పూర్తిగా రద్దు చేయాలని భావిస్తున్నారు.

దీని గురించి త్వరలోనే గైడ్ లైన్స్ పాస్ పోర్ట్ కేంద్రాలకు పంపిస్తామని అధికారులు చెప్తున్నారు. ఇక వీటితో పాటు మైనర్లు, సీనియర్ సిటిజన్లు, ప్రభుత్వ సేవకులు వెరిఫికేషన్ లేకుండా వెళ్లోచ్చని చీఫ్ పాస్ పోర్ట్ ఆఫీసర్ ముక్తేష్ పరదేషి తెలిపారు. వచ్చే ఏడాది నుంచి 48 గంటల్లో ఫ్రెంచ్ విసా వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని…దాని గురించి ఇప్పటికే కసరత్తులు స్టార్ట్ చేసినట్లు ఆయన అన్నారు.

పాస్ పోర్ట్ డెలివరీ టైం బాండ్ గురించి పాస్ పోర్ట్ అధికారులతో సమావేశం నిర్వహించినపుడు పోలీసులు వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఇవ్వడంలో లేట్ చేస్తున్నారని..దీంతో పాస్ పోర్ట్ ఆలస్యం అవుతోందనే విషయం బయటకొచ్చిందన్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు త్వరలోనే పోలీస్ వెరిఫికేషన్ బంద్ చేయనున్నట్లు ఆయన చెప్పారు. కొత్త సిస్టమ్ అందుబాటులోకి వస్తే పాస్ పోర్టు త్వరగా అందుతోందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles