Ys jagan help to apngos

YS Jagan help to apngos, ys jagan latest news, ys jagan with apngo, ys jagan help to apngo, telangana govt takes back lands of apngo, apngo latest news, cm kcr, ys jagan fires on cm kcr, ys jagan fires on chandrababu naidu

YS Jagan help to apngos

‘బాబు’కు అండగా వుంటా..! జగన్

Posted: 07/04/2014 03:33 PM IST
Ys jagan help to apngos

(Image source from: YS Jagan help to apngos)

ఒక్కనిముషం వుండండి..! మీరు తొందరపాటు పడుతున్నట్టున్నారు. ఇక్కడ బాబు అంటే చంద్రబాబు కాదులెండి... ఆంధ్రరాష్ట్రాన్ని రెండుగా చీల్చితున్న సమయంలో సమైక్యాంధ్ర ఉద్యమ పోరాటంలో కీలకపాత్ర పోషించిన ఏపీఎన్జీవోల సంఘ అధ్యక్షుడు అశోక్ బాబు.

ముఖ్యమంత్రి కేసీఆర్ విధించిన నియమాల ప్రకారం... తెలంగాణలో ఏపీఎన్జీవోల భూమిని స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే! ఎపీఎన్జీవోలకు గతంలో శేరిలింగంపల్లి మండలం గోపన్ పల్లి వద్ద సర్వే నెంబర్లు 36, 37లలో కేటాయించిన 189ఎకరాల 14గుంటల భూముల్ని తెలంగాణ ప్రభుత్వం గురువారం స్వాధీనం చేసుకుంది. నిబంధనల ప్రకారం ఈ స్థలాలలో ఇళ్ల నిర్మాణం చేపట్టని కారణంగానే ప్రభుత్వం ఈ భూముల్ని స్వాధీనం చేసుకున్నట్లు స్పష్టం చేశారు.

అలాగే ఎపీఎన్జీఓ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడిగా, డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న అశోక్ బాబు నియామకం నిబంధనలకు లోబడి లేదని సహకార ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. దీంతో ఆయనను ఇకపై ఆ సంఘానికి అధ్యక్షుడిగా, డైరెక్టర్ గా కొనసాగడానికి వీల్లేదని ఆ సంస్థ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి విరుద్ధంగా ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను కూడా ట్రిబ్యునల్ కొట్టి పారేసింది. దీంతో ఏపీఎన్జీవోలు ఏమీ తోచని స్థితిలో మునిగిపోయారు.

ఈ వ్యవహారం మీద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి స్పందిస్తూ... అభ్యంతరం తెలిపారు. తెలంగాన ప్రభుత్వం వెంటనే ఎపీఎన్జీవోల భూముల్ని తిరిగి ఇచ్చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎరికైనా భూములు కేటాయించాలంటే ప్రత్యామ్నాయాన్ని ప్రభుత్వం చూసుకోవాలన్న ఆయన... ఏపీఎన్జీవోలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అండగా వుంటుందని ఆయన భోరాసానిచ్చారు. అలాగే అశోక్ బాబుపై వేసిన వేటు సమంజసం కాదని ఆయన ఆవేదన వ్యాఖ్యానించారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles