(Image source from: NDA goverment finalised to remove upa governors with the help of president after budget elections)
2014 సార్వత్రిక ఎన్నికల తరువాత కేంద్ర ప్రభుత్వాన్ని చేజిక్కించుకున్న ఎన్టీయే... యూపీఏ హయాంలో నియమితులైన గవర్నర్లను మార్చేందుకు కార్యక్రమాలను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే! ఇందుకు సంబంధించిన సమాచారాన్ని గవర్నర్లకు అందించిన తరువాత... ఒకట్రెండు రాష్ట్రాలు మినహా మిగతా రాష్ట్రాల గవర్నర్లు తమతమ పదవులకు రాజీనామాలు ఇచ్చేశారు కూడా!
కానీ కేరళ గవర్నర్ షీలా దీక్షిత్, అసోం గవర్నర్ జేబీ పట్నాయక్ లతోపాటు... మరికొందరు గవర్నర్లు మాత్రం తమ పదవులను వదిలేందుకు ఇష్టపడటం లేదు. గతంలో కూడా సుప్రీంకోర్టు... కేంద్రం మారిన వెంటనే గవర్నర్లు మారాల్సిన అవసరం లేదని ప్రకటించింది. దీనిని అడ్డం పెట్టుకుని ఆయా గవర్నర్లు రాజీనామాలు చేయడానికి ముందుకు రావడం లేదు. మరికొందరు గవర్నర్లయితే.. తమకు హోంశాఖ కార్యదర్శి నుంచి రాజీనామా చేయాల్సిందిగా ఫోన్లు వస్తున్నాయని.. ఇలా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని.. అసలు ఇది పద్ధతేనా..? అంటూ ఎన్టీయే ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.
దీంతో ఎన్టీయే నేతలు ఒక్కసారిగా షాక్ తిన్నారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా నియమితులైన గవర్నర్లను ఎలాగైనా తొలగించాలని నిర్ణయించుకున్న కమలనాథులు... ఈ విషయంపై చర్చించేందుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సహాయం తీసుకుంటున్నట్లు వారు చెబుతున్నారు. కేంద్ర నిబంధనల ప్రకారం.. ఏ రాష్ట్ర గవర్నర్ అయినా రాష్ట్రపతి విశ్వాసం కోల్పోయిన పక్షంలో వెంటనే వారికి తమ పదవుల నుంచి తప్పుకోవాల్సి వుంటుంది. దీనికి మరోమాట అవసరం వుండదు.
అందువల్ల ఎన్టీయే నేతలు ఈ రాష్ట్రపతి అస్త్రాన్ని ఉపయోగించి, గవర్నర్లకు తొలగించే పనిలో పడినట్లు తాజా సమాచారం! రాష్ట్రపతి సదరు గవర్నర్లపై విశ్వాసం కోల్పోయానని తెలిపి... వారిని రాజీనామా చేయాలని చెబితే.. వారు వెంటనే రాజీనామా ఇచ్చేయాల్సి వుంటుంది. ఈ విషయం మీద బాగా పరిశోధన చేసిన ఎన్టీయే.. కాంగ్రెస్ నియమిత గవర్నర్లను తొలగించేందుకు రాష్ట్రపతి సహాయం తీసుకోవడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. బడ్జెట్ సమావేశాల తరువాత కేంద్రం దీనిపై దృస్టి పెట్టనున్నట్టు నేతలు తెలుపుతున్నారు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more