Threat to life complains woman accuses central minister

Threat to life complains woman accuses Central Minister, Rape victim threat to life, Nihal Chand Meghwal accused of rape, Union Minister accused of rape

Threat to life complains woman accuses Central Minister Nihal Chand Meghwal

17 మంది రేప్ చేసారు- ప్రతిరోజూ ప్రాణభయమే!

Posted: 06/19/2014 09:34 AM IST
Threat to life complains woman accuses central minister

భర్తతో సహా మరిది సాయంతో 17 మంది తనను రేప్ చేసారని, అందులో ఒక కేంద్ర మంత్రి కూడా ఉన్నాడని, అందువలన ప్రతిరోజూ తనకి ప్రాణభయం ఉందని ఆవేదన వెలిబుచ్చుతోంది 20 సంవత్సరాల మహిళ.  కేంద్ర మంత్రి నిహాల్ చంద్ మేఘ్వాల్ మీద అత్యాచారం కేసు పెట్టిన మహిళ ప్రతిరోజూ వస్తున్న హెచ్చరికలు, బెదిరింపులు, మానసిక వేదన వలన తనిక ఊళ్ళో ఉండటం కూడా కష్టమే నంటూ చెప్తోంది.  అందుకు కారణం తను కేసు పెట్టిన వాళ్ళల్లో పెద్ద పెద్దవాళ్ళు, సీనియర్ పోలీస్ ఆఫీసర్లు ఉన్నారంటూ ఆమె ఆరోపిస్తోంది.  

(పై ఫొటోలో ఢిల్లీలో భాజపా కార్యాలయం ముందు ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు)

బాధితురాలు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, "నేనేం చెయ్యను ఎక్కడికిపోను.  ఆరు నెలలపాటు నాకు మత్తు మందిస్తూ అంత మందితో అత్యాచారం చేయించారు.  నిహాల్ చంద్ నా మీద రెండు సార్లు అత్యాచారం చెయ్యటం నాకు గుర్తుంది.  మంత్రి మనుషులు ఎక్కడున్నా నా దగ్గరికి వచ్చి నన్ను బెదిరిస్తున్నారు.  క్షణక్షణం భయంతో జీవిస్తున్నాను.  నా ఫిర్యాదులోంచి మంత్రి పేరును తొలగించమని వత్తిడి చేస్తున్నారు.  కానీ నా జీవితంలో నాకు ఎదురైన అటువంటి ఘాతుకాన్ని నేను ఎలా మర్చిపోగలను?  నా చెల్లెలు, తమ్ముడు, కుటుంబ సభ్యులను కూడా చంపుతామని బెదిరిస్తున్నారు"  అన్న ఆమె, "ప్రధానమంత్ర మోదీ చాలా గొప్ప వ్యక్తి.  నాకు న్యాయం జరుగుతుందని నేను ఆశిస్తున్నా" అంది.

2011 లో అప్పుడు 17 సంవత్సరాల ప్రాయంలో ఉన్నప్పుడు తన భర్త ప్రోద్బలంతో తన మీద జరిగిన అత్యాచారం మీద అప్పట్లో పెట్టిన కేసును 2012 లో రాజస్తాన్ పోలీసులు మూసివేయగా, కోర్టు కూడా కేసు కొట్టివేయగా దాన్ని మరోసారి తిరగదోడిన బాధితురాలు వేసిన పిటిషన్ మీద జిల్లా కోర్టు స్పందించి మేఘ్వాల్ తో పాటు మరో 17 మందికి నోటీసులు పంపించి ఆగస్ట్ 20 వరకు దాని మీద సమాధానం ఇవ్వమని కోరింది.  

కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యకర్తలు నిహాల్ చంద్ ని వెంటనే మంత్రి పదవి నుంచి తొలగించాలంటూ ఆందోళన చేస్తున్నారు.  నేషనల్ కమిషన్ ఫర్ వుమెన్ కూడా దీని మీద ప్రధాన మంత్రికి రాయటానికి సిద్ధపడింది.  ఇది చాలా అమానుషమని, ఒక మంత్రే ఇలాంటి చర్యకు పూనుకున్నా అతనికి కూడా సామాన్య వ్యక్తి కి పడే శిక్షే పడాలంటూ, ముందుగా ఆ మంత్రిని పదవినుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles