Maharashtra governor refuses to resign

Maharashtra Governor refuses to resign, Governor Shankara Narayana refuses to resign, Maharashtra Governor Shankar Narayana challenges NDA, Governors President representatives

Maharashtra Governor refuses to resign on verbal requests

దమ్ముంటే రాతపూర్వకంగా రాజీనామా కోరండి- మహారాష్ట్ర గవర్నర్

Posted: 06/19/2014 10:17 AM IST
Maharashtra governor refuses to resign

యుపిఏ ప్రభుత్వంలో నియమితులైన గవర్నర్ల రాజీనామాలను కోరిన ఎన్డియే ప్రభుత్వానికి మహారాష్ట్ర గవర్నర్ కె.శంకర నారాయణ సవాల్ విసిరారు.  దమ్ముంటే రాజీనామా చెయ్యమని రాతపూర్వకంగా అడగండి అన్నారాయన.  

హోం సెక్రటరీ అనిల్ గోస్వామి ఫోన్ చేసి తనను, ఇతర యుపిఏ నియమిత గవర్నర్లను రాజీనామా చెయ్యమని అడుగుతున్నారని శంకరనారాయణ మీడియా ప్రతినిధులతో అన్నారు.  ఏ పదవీ శాశ్వతం కాదన్న విషయం తనకి తెలుసని, కానీ ఎన్డియే విధానమే తనకి నచ్చలేదని ఆయన అన్నారు.

గవర్నర్ పదవి రాజ్యాంగబద్ధమైనది  గవర్నర్లు రాష్ట్రపతికి ప్రతినిధులు.  నా రాజీనామా కోరే అధికారమున్నవాళ్ళు నన్నడిగే నేను ఆలోచిస్తా అంతే కానీ ఇతరులు ఆ విషయంలో నా మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం రాజ్యాంగవిరుద్ధం అన్నారు శంకరనారాయణ.  తాను గోస్వామికి ఈ విషయంలో సమాధానం కూడా చెప్పలేదని అన్న శంకరనారాయణ, అంతకు ముందు ప్రభుత్వంలో నియమించబడ్డ గవర్నర్లను తొలగిపొమ్మని అనటమేమిటి ఇది చాలా ఆశ్చర్యజనకంగా ఉంది అని అన్నారు.  

అయితే యుపిఏ ప్రభుత్వంలో కాంగ్రెస్ నాయకులనే గవర్నర్లుగా నియమించటం జరిగింది.  అలాంటివాళ్ళు 19 మంది ఉన్నారు.  రాజ్యాంగం ప్రకారం కారణం లేకుండా వాళ్ళని తొలగించటం సాధ్యం కాదు కనుకనే వాళ్ళని రాజీనామా చెయ్యమని కోరటం జరుగుతోంది.  

కొందరు గవర్నర్ల మీద ఉన్న కేసులు వాళ్ళు ఆ పదవినుంచి తొలగగానే వాళ్ళ మెడకి చుట్టుకునే అవకాశం కూడా ఉండటం కూడా గవర్నర్లు ప్రతిఘటించటానికి కారణమని భావిస్తున్నారు విశ్లేషకులు.  అయితే 82 సంవత్సరాల శంకర నారాయణ కేవలం సిద్ధాంతపరంగా రాజీనామాకి అంగీకరించటం లేదని అన్నారు.

అయితే, యుపిఏ ప్రభుత్వం గవర్నర్లను నియమించినప్పుడు మీరెవరు మమ్మల్ని నియమించటానికి అని ఎవరూ అడగలేదు!

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles