Nara lokesh take charges as co ordinator for tdp welfare fund

nara lokesh take charges, lokesh take charges as co-ordinator for tdp, , Lokesh, telugudesam party, tdp, tdp workers, co-ordinator of the TDP workers, TDP welfare fund

nara lokesh take charges as co-ordinator for tdp welfare fund

మీకోసమే అబ్బాయిని అందుబాటులో ఉంచాను?

Posted: 06/19/2014 08:39 AM IST
Nara lokesh take charges as co ordinator for tdp welfare fund

కుప్పం సారు.. చాలా తెలివిగా ముందుకు పోతున్నారు. తన రాజకీయ జీవితాన్ని తన కొడుకు కు చెందే విధంగా తొలి అడుగులు బాగానే వేస్తున్నారు. సీమాంద్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. సీమాంద్రను సింగపూర్ చేస్తానని సీమాంద్ర ప్రజలకు హామీ ఇవ్వటం జరిగింది. ఒక బావమరిది బాలయ్య ను ఎమ్మెల్యే గా గెలిపించుకొని తన లెప్ట్ హ్యాండ్ గా పెట్టుకున్నాడు. ఇప్పుడు తన రైడ్ హ్యాండ్ గా తన కొడుకు నారా లోకేష్ బాబు తెరపైకి తెచ్చాడు.

తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయ కర్తగా నారా లోకేష్ బాధ్యతలు చేపట్టారు. ఆయన ఈరోజు ఉదయం 8 గంటలకు పార్టీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరిస్తారు. లోకేష్ మాట్లాడుతూ కార్యకర్తలకు ప్రతి నిమిషం అందుబాటులో ఉంటానన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అనే తేడా లేకుండా అందరు కార్యకర్తలను ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.

nara-lokesh-tdp-welfare

తనపై నమ్మకం ఉంచి అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని లోకేష్ తెలిపారు. కాగా పార్టీ కార్యకర్తల సంక్షేమనిధికి సమన్వయకర్తగా లోకేష్ నియమితుడైన కొద్ది సేపటికే అనేక మంది టిడిపి సీనియర్ నాయకులు తమ విరాళాలను నేరుగా కార్యాలయానికి పంపించటం విశేషం.

అయితే నారా లోకేష్ పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయ కర్తగా నియమించటం పై పార్టీలోని సీనియర్ నేతలు కొంచెం అసహనం వ్యక్తం చేయటంతో.. చంద్రబాబు రంగంలోకి దిగి.. ‘‘మీకోసమే అబ్బాయిని అందుబాటులో ఉంచానని తియ్యని మాటలు నాలుగు చెప్పటంతో.. అసహనం వ్యక్తం చేసిన నేతలు సైతం.. లోకేష్ నాయకత్వం వర్థిలాలి అంటూ.. జై కొట్టారు. ఇలాగే అబ్బాయి కి ప్రతి ఒక్కరు జై కొట్టాలని చంద్రబాబు తన మనసులో భారీ గా కోరుకున్నారు. చంద్రబాబుకు కోరిక ఆ దేవుడు తీర్చుతాడో లేదా చూడాలి. మరీ అబ్బాయి రాజకీయంగా ఎలాంటి అడుగులు వేస్తాడో చూద్దాం.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles