Chandrababu naidu fire on lokesh babu

chandrababu naidu fire on lokesh babu , cm chandrababu, loksh babu, pawan kalyan, janasena party, tdp.

chandrababu naidu fire on lokesh babu

లోకేష్ ..వెళ్లి పవన్ వద్ద నేర్చుకో : బాబు

Posted: 06/13/2014 07:36 AM IST
Chandrababu naidu fire on lokesh babu

సీమాంద్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. తన కొడుకు లోకేష్ పై ద్రుష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఎలాగైన వారుసుడ్ని రాజకీయంగా ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో లోకేష్ బాబుకు . తప్పడగుడులు నేర్పిస్తున్నారు. అంటే తన చేతుల నుండి పార్టీ చేజారిపోకుండా రాజకీయ వారసుడ్ని సిద్ధం చేస్తున్నారు. యోగా గురువు రాందేవ్ బాబాతో ఆశీస్సులను అందించి నెమ్మదిగా తన కుమారుడు లోకేష్‌ను పార్టీలో కీలక బాధ్యతలను అప్పగించి పార్టీపై పట్టు సాధించాలని చంద్రబాబు యోచిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఎన్నికల సమయంలో.. జూనియర్ ఎన్టీఆర్ కు చెక్ పెట్టిన విషయం తెలిసిందే. కాదు ..కాదు.. జూనియర్ ఎన్టీఆర్ , చంద్రబాబుకు, టిడిపి దూరంగా ఉన్నారు. ఇలాంటి సమయంలో హైటేక్ బుర్రతో ఆలోచించి, తన మైండ్ గేమ్ తో.. ‘‘జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ’’ను టిడిపి తెరపైకి తెచ్చుకున్నాడు. ఈ సమయంలోని చంద్రబాబు తన కొడుకు లోకేష్ ను తీసుకొని పవన్‌కళ్యాణ్‌ వద్దకు తీసుకువెళ్లి, ఎన్నికల ప్రచారానికి పిలిచిన విషయం తెలిసిందే. ఆ సమయంలో లోకేస్, చంద్రబాబు పవన్ ఇంటికి వెళ్లడం ద్వారా సమీకరణల విషయంలో బాబు వ్యూహాన్ని పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు.

అయితే ఇటీవల జరిగిన పార్టీ కార్యక్రమాల్లోనూ, సొంత వ్యవహారాల్లోనూ, మరోపక్క పార్టీ కీలక సమావేశాల్లో కూడా లోకేష్‌ను పక్కనే కూర్చోబెట్టుకుని వ్యవహారాలుసాగించడం ద్వారా తమ నేత చెప్పకనే భవిష్యత్‌ను చెబుతున్నట్టుందని పార్టీ సీనియర్ నేత ఒకరు విశ్లేషించారు.

pawan-lokeshbabu-tdp

అంతేకాకుండా రెండేళ్లుగా లోకేష్‌ను వివిధ సందర్భాల్లో ప్రధానమైన వ్యక్తిగా చంద్రబాబు ఆయనకు బాధ్యతలను అప్పగించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రచార బాధ్యతను కూడా అప్పగించారు. అంతకుముందు పార్టీ నడిపించాలంటే అవసరమైన ప్రజాసంబంధాల బాధ్యత కూడా అప్పగించారు. ఒక టివి చానల్ అధిపతిగా ఇటు పాత్రికేయులతో అటు రాజకీయ నాయకులతో నిరంతరం సంబంధాలు నెరపిన లోకేష్‌కు అంతర్గత బాధ్యతలను కూడా అప్పగించి చంద్రబాబు పలుప్రయోగాలు ఇప్పటికే చేశారు.

మరో విషయం ఏమిటంటే పార్టీలోని సీనియర్ నేతలు సుజనా చౌదరి, గరికపాటి మోహనరావు, నారాయణ విద్యాసంస్థల అధిపతి నారాయణ, సిఎం రమేష్ తదితరులు అంతా లోకేష్‌కు అత్యంత సన్నిహితంగా ఉండటంతోపాటు పార్టీ వ్యవహారాలను గుట్టుచప్పుడు కాకుండా చక్కబెడుతున్నారు.

అంతేకాకుండా.. లోకేష్ బాబు.. పవన్ కళ్యాన్ తో సన్నిహిత సంబందాలు కొనసాగించాలని చెప్పినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ..రాబోయే కాలంలో.. పవన్ కళ్యాణ్ తో మనకు చాలా అవసరం ఉందని లోకేస్ గుర్తు చేసినట్లు సమాచారం. అంటే ఒకవిధంగా పవన్ వద్దకు వెళ్లి నేర్చుకో, నువ్వు రాజకీయంగా ఎదగాలని చంద్రబాబు తన వారసుడికి కొన్ని షరతులు విధించినట్లు తెలుస్తోంది. ఇక లోకేష్ ఏం చేస్తాడో? ఏం విదంగా ముందుకు పోతాడో చూద్దాం.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles