Maharashtra govt to ban bar dancers again

Maharashtra Govt to ban bar dancers again, Bar dancing to be banned in the State of Maharashtra, Supreme court allows bar dancers, Ban on bar dancers unconstitutional SC says

Maharashtra Govt to ban bar dancers again

బార్ డ్యాన్సర్ల పొట్టమీద కొట్టే ప్రయత్నంలో మహారాష్ట

Posted: 06/12/2014 06:55 PM IST
Maharashtra govt to ban bar dancers again

బార్ లలో డ్యాన్స్ లు చేస్తూ జీవితాలను వెళ్ళదీసుకుంటున్న డ్యాన్సర్లను గత సంవత్సరం సుప్రీం కోర్టు అనుమతిస్తూ అందుకు వాళ్ళకు లైసెన్స్ లు ఇవ్వాలని కూడా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.  

కానీ కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం మరోసారి మూడు ఐదు సితారల హోటళ్ళలో బార్ లలో డ్యాన్స్ లను బహిష్కరించటానికి మహారాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.

ఈ వివాదం ఇప్పటిది కాదు.  2005 లో ముంబై పోలీస్ బార్ లలో డ్యాన్స్లను నిషేధిస్తూ ఆజ్ఞలు జారీ చేసింది.  అయితే 3 స్టార్ ఆ పై స్థాయి హోటళ్ళకు మినహాయింపు లభించింది.  ఆ నిర్ణయం చట్టవిరుద్ధమని బోంబై హైకోర్టు తీర్పునిచ్చింది.  అయితే ఆ హైకోర్టు తీర్పుని మహారాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేసింది.  సమాజానికి తలవంపులు తెచ్చే ఆ వృత్తి ఆడవాళ్ళను వ్యభిచారంలోకి పోవటానికి కూడా దారితీస్తుందని, నేరస్తులకు అడ్డాగా మారుతుందని రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయపడింది.  అంతేకాదు, 345 బార్లకు లైసెన్స్ ఇవ్వగా రాష్ట్రంలో మరో 2500 బార్లు లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తున్నాయని ప్రభుత్వం తెలియజేసింది.  

అయితే కొన్ని మహిళా సంఘాలు రాష్ట్ర ప్రభుత్వం చెప్పేది సరి కాదని, కేవలం మహిళలనే వివక్షతోనే ఈ అభిప్రాయానికి రావటం సబబు కాదని, ఆడవాళ్ళు తమ కాళ్ళ మీద తాము నిలబడి ఆర్థికంగా స్వతంత్రంగా బ్రతకటం అవసరమని వాదించాయి.  

ఈ విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం చేసిన సవాల్ ని కొట్టివేస్తూ సుప్రీం కోర్టు, బార్ లలో డ్యాన్స్ లు చేసుకునేవారు తిరిగి చేసుకోవచ్చని, అయితే వాళ్ళు పనిచేసే బార్లకు లైసెన్స్ వచ్చిన తర్వాతనే అందుకు అనుమతించటం జరుగుతుందని తీర్పునిచ్చింది.  బ్రతుకుతెరువు కోసం చేసే పని రాజ్యాంగం ఇచ్చిన హక్కని తీర్పు నిచ్చిన బోంబే హైకోర్టుతో సుప్రీం కోర్టు ఏకీభవించి, ముంబై పోలీస్ పెట్టిన నిషేధం రాజ్యాంగపరమైన హక్కులను ఉల్లఘించటమౌతుందని తీర్పునివ్వటం జరిగింది.  

మళ్ళీ తాజాగా అదే వివాదానికి తెరెత్తుతూ మహారాష్ట్ర ప్రభుత్వం బార్ లలో డ్యాన్స్ లను పెద్ద హోటళ్ళలో సైతం నిషేధాజ్ఞలు తీసుకుని రావటానికి చూస్తోంది.  ఇది ముంబై నగరానికే కాకుండా రాష్ట్రమంతా వర్తిస్తుంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles