Kcr shows wayout to chandrababu

KCR shows wayout to Chandrababu, Farmer loan waiving, Farmer loans in Telangana, Farmer loans in Andhra Pradesh

KCR shows wayout to Chandrababu

బాబుకి కెసిఆర్ మార్గదర్శనం

Posted: 06/07/2014 10:49 AM IST
Kcr shows wayout to chandrababu

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి చంద్రబాబు నాయుడుకి తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ మార్గదర్శనం చెయ్యనున్నారు.  

ఎన్నికల ప్రచారంలో ఇద్దరూ రైతుల ఋణమాఫీ గురించి హామీలు చేసారు.  అది చెయ్యగలిగే పని కాదని, కేవలం ఎన్నికల కోసం ఇస్తున్న హామీలని వైయస్ జగన్ విమర్శించగా, ఎలా చెయ్యాలో మాకు తెలుసు, చేసి చూపిస్తానని చంద్రబాబు నాయుడు జవాబిచ్చారు.

తెలంగాణా ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు ముందుగా ప్రమాణస్వీకారం చెయ్యటంతో మొదటి సంతకం ఋణమాఫీల మీదనే అన్నదానికి కట్టుబడి ఆయన రైతు ఋణాలు అసలు ఎంత మొత్తంలోఉన్నాయి, వాటి వివరాలేమిటన్నదాని మీద బ్యాంకర్లతో భేటీ అయ్యారు.  

అయితే ఈ ఋణమాఫీలనే సంప్రదాయానికే కొన్ని బ్యాంకులు అభ్యంతరాలు తెలియజేసాయి.  ఠంచన్  గా అప్పులు తిరిగిచ్చినవాళ్ళుంటే వాళ్ళు తాము తప్పు చేసామేమో అని అనుకునే అవకాశం ఉంది.  వచ్చే సంవత్సరం కూడా అలాగే చేస్తారేమో కిస్తులు కట్టకుండా ఉందాం అనుకోవటం కూడా జరగవచ్చు.  అంటే సరైన పంథాలో లోన్లు తీసుకుని తిరిగి చెల్లించే నిబద్ధత ఉన్నవాళ్ళను కూడా చెడగొట్టటానికి అవకాశం పూర్తిగా ఉంది.

లక్ష రూపాయల వరకు అప్పలను తిరిగి చెల్లించకుండా మాఫీ చేస్తామని ముందే అనటం జరిగింది కానీ బ్యాంకర్లతో చర్చించిన తర్వాత కేవలం 2013-14 ఆర్థిక సంవత్సరంలో తీసుకున్న ఋణాలను మాత్రమే మాఫీ చేస్తామని ప్రకటించటం జరిగింది.  

ఇది రైతులకు ఆగ్రహావేశాలను, ప్రతిపక్షాలకు విమర్శించే అవకాశాన్ని కలుగజేసింది.  అధికారంలోకి వస్తూనే విమర్శలను ఎదుర్కోవటం, ప్రతిపక్షాలు ప్రజల తరఫున మాట్లాడటానికి వీలు కలిగించటం తెలంగాణాలో అధికార పార్టీ తెరాస కు మానసికంగా ఇబ్బందిని కలిగిస్తున్నాయి. ఇంతవరకు అధికారపక్షంలో ఉన్నవారని విమర్శించటం, ప్రజా ప్రయోజనంలో ఫలానా పని చెయ్యమని, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చమని డిమాండ్ చేస్తూ వచ్చిన తెరాస కు ఇప్పుడు అలాంటి మాటలను తానే స్వయంగా వినవలసివస్తోంది.  

ఇంతకీ ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి అన్నది తెరాసను వేధిస్తున్న ప్రధాన సమస్య.  మొత్తం రూ.40994 వేల కోట్లలో కుదించి రూ.11200 వేల కోట్ల రూపాయలను మాత్రం మాఫీ చెయ్యటానికి తెలంగాణా ప్రభుత్వం ముందుకొచ్చింది.  దానితో పెద్ద ఎత్తున ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల నుంచి నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.  దీన్ని అధిగమించటమెలాగా అన్న దానిలో తెరాస తర్జనభర్జన పడుతోంది.  పైగా డ్వాక్రా గ్రూప్ లకు ఎటువంటి హమీలు ఇవ్వలేదు.  అసలు అప్పడు ఇచ్చిన హామీలనే ఎలా నెరవేర్చాలా అని చూస్తున్న తరుణంలో కొత్త హామీలను ఇవ్వటానికి అసలు అవకాశమే లేదు.

అయితే ఇదే సమస్య ఆంధ్రప్రదేశ్ లోనూ వచ్చే అవకాశం ఉంది. రేపు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం తర్వాత ఆయన రైదు రుణాల విషయంలో ప్రకటనలు చెయ్యవలసివుంది.   ఈ లోపులో కెసిఆర్ ఋణ మాఫీ విషయాల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, కేంద్రానికి పోయిన కెసిఆర్ ఈ దిశగా ఏమైనా కేంద్ర సహాయాన్ని తీసుకోగలుగుతారా అన్నది చూడటానికి చంద్రబాబుకి అవకాశం దొరికింది. అయితే ఆంధ్రప్రదేశ్ లోని రైతు ఋణాలూ ఎక్కువే, అవి కాకుండా డ్రాక్రా గ్రూప్ లకు కూడా చంద్రబాబు హామీలు ఇచ్చున్నారు.

తెలంగాణాలో లా కాకుండా ఎక్కువ మందికి లాభం చేకూరేలా ఋణమాఫీలు చెయ్యగలిగితే మాత్రం ఈ సమయంలో చంద్రబాబు జగన్, కెసిఆర్ ల కన్నా సమర్ధుడనిపించుకుంటారు.  అందుకేనేమో తెలంగాణాలో కూడా ఆయన తన సత్తా చాటుతానని ధీమా వ్యక్తం చేస్తున్నారు.  ముందు నడుస్తున్నవారు వెనక ఉన్నవారికి మార్గదర్శనం ఎలాగూ అవుతారు. 

ముందు నడుస్తున్న బండి గుంతలో పడితే వెనకనున్న బండ్లు ఆ తప్పు జరగకుండా జాగ్రత్తపడతాయి.

-శ్రీజ

Related articles 1

Related articles 2

Related articles 3

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles