బ్యాంకర్లు ఇచ్చిన రైతు ఋణాలను జల్లెడ్ పట్టిన తర్వాత రూ.11,200 వేల కోట్ల రూపాయలను తెలంగాణా ప్రభుత్వం మాఫీ చెయ్యటానికి నిర్ణయించుకుంది.
నిజానికి రైతులు తీసుకున్న ఋణాలలో పంట ఋణాలు, బంగారం తనఖా పెట్టి తీసుకున్న ఋణాలు, టర్మ్ లోన్స్, సిసిడిఎల్ ఋణాలు, ఇతర ఫైనాన్స్ లు వెరసి 40994 వేల కోట్లకు తేలితే, కొన్ని మార్గదర్శకాలను తయారుచేసుకుని ఆ ఋణ భారాన్ని తెలంగాణా ప్రభుత్వం రూ.11200 వేల కోట్లకు కుదించింది.
అందులో లక్షలోపులో ఉన్న ఋణాలను, వాటిని కూడా 2013-14 ఆర్థిక సంవత్సరంలో తీసుకున్నవాటిని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే రూ.14,974 వేల కోట్ల రూపాయలు తగ్గిపోయాయి. ఇతర ఋణాలను వదిలిపెట్టి కేవలం పంట ఋణాలను మాత్రమే లెక్కలోకి తీసుకుంటే రూ. 14897 వేల కోట్లకు దిగింది. దీనిలోనుంచి మరో మూడు రకాల అప్పులను కూడా మినహాయించారు. అవి, బంగారం మీద తీసుకున్న అప్పులు రూ.2700 కోట్లు, సాగు తర్వాత తీసుకున్న అప్పులు పంట ఋణాలలోకి రావు కాబట్టి అవో రూ.500 కోట్లు, మరో రూ.500 కోట్లు పొగాకు, చెరుకు మీద తీసుకున్నవి. వీటిని కూడా మినహాయిస్తే చివరకు మిగిలిన ఋణాలు రూ.11,200 వేల కోట్లు నికరంగా తేలాయి.
ఈ మొత్తాన్ని (ఋణ మాఫీలు రూ.12 వేల కోట్లు అంటూ) ముఖ్యమంత్రి కెసిఆర్ బుధవారం నాడు గజ్వేల్ లో ధృవీకరించారు.
అంటే 2013-14 లో తీసుకున్నవి, కేవలం పంట ఋణాల మీద లక్ష రూపాయల పరిమితి వరకు తెలంగాణా ప్రభుత్వం రైతుల ఋణ భారాన్ని తగ్గించ దలచుకుంది. ఆర్థిక మంత్రిగా పదవీ స్వీకారం చేసిన ఈటెల రాజేందర్ కూడా ఈ విషయాన్ని ధృవీకరిస్తూ, ఎన్నికల సమయంలో పంట ఋణాల మీద లక్ష రూపాయల వరకు మాఫీ చెయ్యటం జరుగుతుందని చెప్పారని, ఆ మాటకు కట్టుబడే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోందని అన్నారు.
అయితే దీని మీద రైతులే కాకుండా మ్యూనిస్ట్ పార్టీలు, మరికొన్ని ప్రజా సంఘాలు కూడా అసంతృప్తిని వెల్లడిచేస్తున్నాయి. బంగారం మీద ఋణాలంటే అది తీసుకుందీ పంట కోసమే కదా అంటారు వాళ్ళు. లక్ష రూపాయల పరిమితి పెట్టారు బాగానేవుంది కానీ, రైతుల అన్ని ఋణాలనూ మాఫీ చెయ్యాలి కానీ, ఏదో విధంగా వెళ్ళదీసుకుని వచ్చి అప్పుల బాధ తాళలేక పంట చేతికొచ్చిన తర్వాత ఋణాలు తీసుకుంటే అది పంట ఋణం కాదని అంటే ఎలా అంటున్నారు.
పోనీ లక్ష రూపాయల పరిమితిని కుదించి ఏ 75 వేలో చేసి అందరినీ తృప్తి పరిస్తే బావుండేదేమో అంటున్నారు కొందరు పెద్దలు. లేదా ఈ సంవత్సరం మొత్తం భారాన్ని మోయలేమనుకుంటే 50000 వరకు ఇచ్చి వచ్చే సంవత్సరం మిగిలిన 50000 వేల ఋణాలను మాఫీ చెయ్యండి. దాని మీద కాస్తో కూస్తో బ్యాంక్ వడ్డీ పెరిగితే అది రైతు కట్టుకుంటాడు అని కూడ కొందరంటున్నారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more