Khalisthan demand comes up again

Khalisthan demand comes up again, Khalisthan demand by Simran Jit Singh Mann, Simran Jit Singh Mann IPS demands Khalisthan

Khalisthan demand comes up again

మరోసారి తలెత్తుతున్న ఖాలిస్తాన్ వాదం

Posted: 06/07/2014 12:31 PM IST
Khalisthan demand comes up again

భింద్రన్ వాలా మరణించిన 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ నిన్న స్వర్ణమందిరంలో ఖాలిస్తాన్ నినాదం వినిపించింది.  

ఖాలిస్తాన్ వాదులు భారత దేశం నుంచి విడిపోయి తమదంటూ ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేసుకోవటం ఉద్యమాన్ని నడిపే ప్రయత్నంలో ఉన్నారు.  అమృత్ సర్ పోలీస్ కమిషనర్ జితిందర్ సింగ్ ఔలాఖ్ చెప్పిన దాని ప్రకారం, ఐపిఎస్ అధికారి సిమ్రన్ జీత్ సింగ్ మాన్ తన అనుచరులతో కలిసి అకాలి తఖ్త్ లోని గర్భాలయం లో ఖాలిస్తాన్ నినాదాన్ని వినిపించటానికి చేసిన ప్రయత్నంలో హింసాకాండ చోటుచేసుకుంది.  ఇరు వర్గాలు కత్తులు దూసాయి.  పోలీసులు కలుగజేసకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

ఖాలిస్తాన్ గురించి మాన్ ఇలా అన్నారు- "సిక్కులకు ఉన్నది ఒకటే డిమాండ్.  అది ఖాలిస్తాన్ ఆవిర్భావం.  న్యూక్లియర్ పవర్ తో చెలగాటమాడుతున్న ఇండియా, పాకిస్తాన్, చైనా మూడు దేశాలకు ఇది మధ్యలో బఫర్ లా ఉంటుంది.   సిక్కుల దేశంలో అన్ని మతాలవారు సామరస్యంతో మెలగగలుగుతారు.  సౌత్ ఆసియాలో శాంతి నెలకొంటుంది.  త్వరలోనే ఖాలిస్తాన్ మ్యాప్ తయారు చేస్తాం.  సౌత్ ఆసియాలో న్యూక్లియర్ యుద్ధానికి చోటులేని ప్రాంతం అదొక్కటే అవుతుంది.  అన్ని మతాలవారు సిక్కులతోపాటు ప్రశాంతమైన జీవనాన్ని సాగించగలుగుతారు."

నిన్న ఆపరేషన్ బ్లూస్టార్ జరిగి 30 సంవత్సరాలైన సందర్భంగా స్వర్ణమందిరంలో ఏర్పాటు చేసిన ఫంక్షన్ లో మాన్ ఉపన్యాసం ఇవ్వదలచుకోగా శిరోమణి అకాలి దల్ కి, శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ టాస్క్ ఫోర్స్ కి మధ్య కత్తులతో యుద్ధం మొదలైంది. అందులో శిరోమణ్ గురుద్వారా ప్రబంధక కమిటీ కి చెందిన ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.  

పోలీసులకు గురుద్వారాలోపలికి అనుమతి లేదు.  కేవలం శిరోమణి ప్రబంధక కమిటీ టాస్క్ ఫోర్స్ కి మాత్రమే లోపల నియంత్రించగలుగుతుంది.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles