Nothing will stop polavaram project javadekar says

Nothing will stop Polavaram Project Javadekar says, BJP Spokesman Prakash Javadekar assures of Polavaram Project, KCR demands change Polavaram project design

Nothing will stop Polavaram Project Javadekar says

పోలవరం ప్రాజెక్ట్ కి అడ్డనేదేమీ లేదు!

Posted: 05/28/2014 01:59 PM IST
Nothing will stop polavaram project javadekar says

పోలవరం ప్రాజెక్ట్ కి ఎలాంటి అడ్డంకులూ ఉండవని భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ ప్రకటించారు.  కృష్ణా, గోదావరి రెండు నదులను కలుపుతూ లక్షలాది ఎకరాలకు సాగు నీరిచ్చే పోలవరం ప్రాజెక్ట్ తప్పక ముందుకెళ్తుందని ఆయన భరోసా ఇచ్చారు.

నిన్న కాబోయే తెలంగాణా ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు పోలవరం ప్రాజెక్ట్ మీద మాట్లాడుతూ, కొత్తగా ఏర్పడ కేబినెట్ హడావిడిగా ఆర్డినెన్స్ ని జారీ చెయ్యవద్దని, అలా చేస్తే తాను వ్యతిరేకిస్తానని చెప్పారు.  పోలవరం ప్రాజెక్ట్ కి తాను వ్యతిరేకిని కానని, అయితే ప్రాజెక్ట్ డిజైన్ లో మార్పులు తేవలసివుంటుందని, పోలవరం డ్యాం నిర్మిస్తే ఆ ప్రాంతంలో భూకంపం ముప్పు ఉంటుందని నీటి పారుదల నిపుణులే వ్యతిరేకిస్తున్నారని కెసిఆర్ అన్నారు.

ఈ విషయంలో వివాదం రాకుండా ఉండటం కోసమేమో జవదేకర్ ప్రత్యేకంగా ఆ ప్రాజెక్ట్ వస్తుందని హామీ ఇచ్చారు.  అందుకే కాబోలు క్యాబినెట్ లో తెలంగాణాకు కూడా త్వరలో ప్రాతినిధ్యం ఉంటుందని కూడా ఆయన చెప్పారు.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles