Balakrishna speech in tdp mahanadu at gandipet 2014

Balakrishna speech in TDP Mahanadu, balayya speech in Mahanadu, balakrishna speech in mahanadu, tdp mahanadu 2014, Nandamuri Balakrishna, telangana telugudesam party,

Balakrishna speech in TDP Mahanadu at Gandipet-2014

తెలంగాణలో అధికారం కావాలి: బాలకృష్ణ

Posted: 05/28/2014 12:37 PM IST
Balakrishna speech in tdp mahanadu at gandipet 2014

మహానాడు బాలకృష్ణ సినిమా డైలాగులు చెప్పాడు. వస్తాం.. తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తాం అని .. బాలకృష్ణ ఆవేశంగా చెప్పటం జరిగింది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి అధికారం కావాలి, రావాలని ఆయన అన్నారు. అంటే తెలంగాణ మొత్తం పసుపుతో నిండిపోవాలి. తెలంగాణలో మొత్తం పసుపు గుర్తు కార్యకర్తలుగా మారాలని ఆయన అన్నారు.

2019 నాటికి తెలంగాణలో పసుపు రంగు అధికారంలోకి రావాలని ఆయన కోరారు. టిడిపి మహానాడులో బాలకృష్ణ తన మనసులోని మాటలను బయటపెట్టారు. ఎవరైనా నన్ను నీవెవరని అడిగితే భారతీయుడినని చెబుతానన్నారు.
మళ్లీ అడిగితే తెలుగువాడినని, మళ్లీ అడిగితే, నందమూరి తారకరామారావు కుమారుడినని, అన్న ఎన్టీఆర్ అభిమానినని చెబుతానంటూ టీడీపీ శ్రేణులను ఉత్సాహపరిచారు. ఎన్టీఆర్ 91 జయంతి సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు.

తెలుగు జాతి ఆత్మగౌరవం కాపాడ్డానికే ఎన్టీఆర్ పార్టీ పెట్టారని, ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశారని చెప్పారు. తర్వాత పార్టీ బాధ్యతలను భుజానికెత్తుకున్న చంద్రబాబునాయడు గారు కూడా ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశారన్నారు.నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి చంద్రబాబునాయుడితోనే సాధ్యమని, టీడీపీకి అధికారం కట్టబెట్టడం ద్వారా ప్రజలు తమ అభీష్టాన్ని తెలియజేశారని నటుడు బాలకృష్ణ అన్నారు.

ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లుగా రైతుల రుణమాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ, ఇంటింటికో ఉద్యోగం తదితర హమీలను అమలు చేస్తామన్నారు. అలాగే, ఉద్యోగుల సహకారంతో చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళతారని చెప్పారు. హిందూపురంలో తనను గెలిపించినందుకు నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles