Narendra modi oath taking cermony

Narendra Modi oath taking cermony, Narendra Modi swearing in ceremony, Narendra Modi oath taking at Rashtrapati Bhawan

Narendra Modi oath taking cermony

నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారోత్సవం

Posted: 05/26/2014 06:05 PM IST
Narendra modi oath taking cermony

రాష్ట్రపతి ఆధ్వర్యంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం జరిగింది.  సభా ప్రాంగణమంతా కరతాళ ధ్వనులతో నిండిపోయింది.  ఆ తర్వాత క్యాబినెట్ మంత్రుల ప్రమాణ స్వీకారం ముందుగా రాజ్ నాథ్ సింగ్ తో ప్రారంభమైంది.

రాష్ట్రపతి ఆధ్వర్యంలో 45 మంత్రులతో కనీసం రెండు గంటలపాటు సాగే ప్రమాణ స్వీకారం తర్వాత అతిథులందరికీ రాష్ట్రపతి తేనీటి విందు ఇచ్చిన తర్వాత, సౌత్ బ్లాక్ లోని ప్రధానమంత్రి కార్యాలయంలో నరేంద్ర మోదీ ఒక గంట సేపు అత్యవసర దస్త్రాలను పరిశీలించి ప్రధాన మంత్రిగా తన పనికి శ్రీకారం చుడతారు.

నరేంద్ర మోదీ రాష్ట్రపతి భవన్ కి విచ్చేసారు  అందరూ రాష్ట్రపతి రాకకోసం వేచి చూస్తున్నారు.

మర్యాద పూర్వకంగా పాకిస్తాన్ ప్రధాని మరి కొందరు నాయకులతో భేటీ అయిన మోదీ తన ఆహ్వానం మేరకు ప్రమాణ స్వీకార మహోత్సవానికి విచ్చేస్తున్నవారందరికీ ట్విట్టర్లో స్వాగతం పలికారు.  

నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి అతిథులంతా చేరుకుంటూ ఉండటంతో రాష్ట్రపతి భవనమంతా కోలాహలంగా తయారైంది.  మరి కాసేపట్లో ప్రమాణ స్వీకారం మొదలవబోవటంతో అతిథులు ముందుగానే వేదికకు చేరుకున్నారు.  ఎనిమిది సరిహద్దు దేశాల నాయకులతో పాటు 1000 మంది అతిథులు విదేశాల నుంచి, 3000 మంది దేశం నలుమూలల నుంచి విచ్చేసారు.  

విభజన జరిగిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల కాబోయే ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కె చంద్రశేఖరరావు లు ప్రమాణ స్వీకార వేదికకు చేరుకుని నిర్దేశిత స్థలాలలో కూర్చున్నారు.

రాజస్తాన్ నుంచి 25 ఎంపీలను ఇచ్చినా ఆ రాష్ట్రం ఎంపీలకు సముచిత హోదానివ్వలేనని వసుంధరా రాజే నిరసన తెలియజేసారు.  బికానెర్ హౌస్ లో అలిగి కూర్చున్న ఆమె, ఆమెతో వచ్చిన 25 ఎంపీలతో భాజపా సంప్రదింపులు చేస్తున్నారు.  

తక్కువ సంఖ్యతో ఎక్కువ సమర్థవంతమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యాలన్న ఉద్దేశ్యంతో తక్కువ మందికి అవకాశం ఇచ్చామని చెప్పినా ఆమె తన పట్టు వీడలేదు.  ఇంతవరకు భాజపాలో మోదీ నిర్ణయానికి సీనియర్ నాయకులు కూడ ఎవరూ నిరసన చూపించలేదు.  మొదటి సారిగా అది కూడా ప్రమాణ స్వీకారానికి ముందుగానే నిరసన చూపించారు వసుంధర రాజే.

ఈ సమస్యను మోదీ పరిష్కరించినట్లుగానే కనపడుతోంది.  రాజస్థాన్ ఎంపీలలో ఒకరికి చోటిచ్చి, మంత్రవర్గ విస్తరణ లో మిగతావారికి కూడా అవకాశం ఉంటుందని మోదీ తెలియజేసారు.

మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ లోక్ సభ స్పీకర్ మీరా కుమార్,

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles