Pakistan and srilanka release indian fishermen

Pakistan and Srilanka release Indian fishermen, Indian fishermen in jails released by Pakistan, Indian fishermen released by Sri Lanka

Pakistan and Srilanka release Indian fishermen

పాకిస్తాన్ శ్రీలంకల సుహృద్భావ చర్యలు!

Posted: 05/26/2014 10:17 AM IST
Pakistan and srilanka release indian fishermen

పాకిస్తాన్, శ్రీలంక జైళ్ళల్లో మగ్గుతున్న మత్సకారులను ఆయా దేశాలు భారత్ పట్ల సుహృద్భావ చర్యగా విడుదల చేసారు.  

పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్, శ్రీలంక అధ్యక్షుడు మహిందా రాజ్పక్సా లను నరేంద్రమోదీ ప్రమాణస్వీకారోత్సవానికి ఆహ్వానించటం జరిగింది.  ఈ సందర్భంగా ఆయా దేశాలు తమ వంతుగా ఈ విధంగా సుహృద్భావాన్ని ప్రదర్శించి మోదీ మైత్రిని అంగీకరించిన సంకేతాలిచ్చాయి.  

వీరిద్దరినీ ఆహ్వానించటాన్ని దేశంలో కొందరు సమర్థిస్తే మరికొందరు వ్యతిరేకించారు.   పాకిస్తాన్ సైనికులు అతి దారుణంగా భారత్ జవాన్ హేమ్ రాజ్ తల నరికి తీసుకెళ్ళిన ఘటన తర్వాత పాకిస్తాన్ ప్రధానిని ఆహ్వానించటం సైనికుడిని అవమానించినట్లేనని హేమ్ రాజ్ భార్య ధర్మవతి నిరసన ప్రదర్శిస్తున్నారు.  పాక్ ప్రధాని ఆ ఘటనను ఖండించటం కాని, లేదా తన భర్త తలను తిరిగివ్వటం కాని చెయ్యాలని ఆమె పట్టుబట్టి నిరాహార దీక్షకు దిగనున్నారు.

రాజ్పక్సాను పిలవటం మీద తమిళ నాయకులు నిరసనలు వ్యక్తం చేసారు.  తమిళనాడు జయలలిత మోదీ ప్రమాణ స్వీకారానికి హాజరుకావటం లేదు.
ముస్లిం యూత్ ఆఫ్ మహారాష్ట్ర పాక్ ప్రధానిని ఆహ్వానించటాన్ని తప్పుపట్టారు.  అందుకు వ్యతిరేకంగా ప్రదర్శనలను నిర్వహిస్తామని కూడా వాళ్ళు హెచ్చరించారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles