Pawan kalyan future plans

Pawan Kalyan future plans, Pawan Kalyan Jana sena party future activities, Jana Sena party to contest Hyderabad corporation

Pawan Kalyan future plans as expressed by him

పవన్ వెల్లడిచేసిన భవిష్యత్ కార్యకలాపాలు

Posted: 05/24/2014 12:45 PM IST
Pawan kalyan future plans

హైద్రాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించిన ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తాను కమ్యూనిస్ట్ భావజాలం నుంచి పక్కకు పోవటం లేదని అన్నారు.  లెఫ్ట్ రైట్ రెండు భావజాలాల సారాంశంతో తయారు చేసి హైబ్రీడ్ రాజకీయం సరైనదని ఆయన అభిప్రాయపడ్డారు.  కార్పొరేషన్ ఎన్నికలలో జనసేన, తెదేపా, భాజపాలు కలిసి కూటమిగా పోటీ చెయ్యవచ్చని పవన్ కళ్యాణ్ అన్నారు.
ఒక సంవత్సర కాలంలో జనసేన పార్టీ నిర్మాణం జరుగుతుందని, చేతిలో ఉన్న సినిమాల వలన ఆరు నెలలు అందులో బిజీగా ఉన్నా, పార్టీని నడిపించే బాధ్యత పూర్తిగా తనమీదనే ఉందని, చెప్పినట్లుగానే విలువలతో కూడిన రాజకీయాల కోసమే తాను అడుగుపెట్టానని, అదే విధంగా పార్టీని నడుపుతానని పవన్ కళ్యాణ్ ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ తెలియజేసారు. పార్టీ కార్యాలయం నానక్ రాం గుడా పరిసరాల్లో ఉండవచ్చని ఆయన అన్నారు.  
2014 ఎన్నికలలో మోదీ కంటే వేరే ఎవరూ సమర్ధవంతంగా కనిపించకపోవటంతో ఆయనతో కలిసి పనిచేసానని అన్న పవన్ కళ్యాణ్ భాజపా తో కలిసే ప్రసక్తే లేదని స్పష్టం చేసారు.  అయితే రాజకీయాలలో ఒక్కసారే పెనుమార్పు వస్తుందని కూడా నమ్మనని, దానికి సమయం పడుతుందని తెలుసని, ఎన్నికలలో అభ్యర్థులు ఓడిపోయినా నీరసపడేది లేదని, అంత మాత్రం చేత రాజకీయాలలోంచి పారిపోనని, ఓడిన ప్రతిసారీ దాన్నో అనుభవంలా చూస్తానని, చెగువేరా లాంటి గొప్ప ఉద్యమ నాయకులే ఎన్నోసార్లు పరాజయాన్ని పొందారని పవన్ కళ్యాణ్ అన్నారు.  
మోదీ, చంద్రబాబుల వలన దేశం, రాష్ట్రం అభివృద్ధి చెందుతాయన్న విశ్వాసాన్ని ప్రకటించిన పవన్ కళ్యాణ్ ఉచిత సలహాలిచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టనని, అయితే తన అవసరం ఉందని వాళ్ళు అనుకున్నప్పుడు మాత్రం తప్పక సాయంగా నిలబడతానని మాటిచ్చారు.
నేతలను గుర్తించి జనసేనలోకి ఆహ్వానించటం, పార్టీ కార్యక్రమాలను రచించి ముందుకు తీసుకెళ్ళటం ఆరు నెలల్లో పూర్తి చేస్తానని పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు.
-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles