Directives from center for employees distribution

Directives from Center for employees distribution, Distribution of Telangana AP employees, Telangana appointed day June 2, Objections in employees distribution

Directives from Center for employees distribution between Telangana and Andhra Pradesh

ఉద్యోగుల పంపిణీ మీద మార్గదర్శకాలు

Posted: 05/24/2014 11:01 AM IST
Directives from center for employees distribution

ఉద్యోగుల విభజనలో అరిచే నాయకుల నోళ్ళు మూతలుపడేట్టుగా కేంద్ర ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు వచ్చాయి.  వాటి ప్రకారం జనాభా ప్రాతిపదికన అంటే 41.68, 58.32 నిష్పత్తిలో ఉద్యోగుల భట్వారా జరగాలని, తెలంగాణాలో ఉద్యోగులు తక్కువపడితే ఆంధ్రా నుంచి సర్దుబాటు చెయ్యాలని, అలాగే ఆంధ్రాలో ఉద్యోగులు అవసరం పడితే తెలంగాణా నుంచి సర్దుబాటు చెయ్యాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.  ఇది తాత్కాలిక ఏర్పాటేనని, ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చుని ఈ సమస్యను పరిష్కరించుకోవలసివుంటుందని కూడా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం తెలియజేసింది.   

సీమాంధ్ర ఉద్యోగులను తెలంగాణాలో పనిచెయ్యనివ్వం, గేట్లు దాటి లోపలికి రానివ్వమంటూ ఉద్యోగ సంఘాలతో సమావేశమైన కెసిఆర్ వ్యాఖ్యానించటం జరిగిన వెంటనే ఇలాంటి మార్గదర్శకాలు రావటం మీద తెలంగాణా నాయకులు మండిపడుతున్నారు.  

మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి-

* గ్రామ స్థాయి నుంచి మల్టీ జోనల్ కేడర్ వరకు ఎక్కడ పని చేస్తున్నవారు అక్కడే కొనసాగుతారు.  ఒకవేళ అక్కడ మంజూరైన పోస్ట్ లలో ఉద్యోగులు తక్కువ పడితే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సర్దుబాటు చేస్తారు.  అంటే అవసరమైతే తెలంగాణాకు ఆంధ్రా నుంచి ఉద్యోగులను సర్దుబాటు చెయ్యటం జరుగుతుంది.  

* సర్వీస్ రిజిస్టర్ లో నమోదైన స్థానికత ఆధారంగానే ఉద్యోగుల నియామకం జరుగుతుంది.  

* తెలంగాణాలోని ప్రత్యేక ప్రాజెక్ట్ లు, ప్రత్యేక కార్యాలయాలు, ప్రత్యేక సంస్థలలోని ఉద్యోగులు ఎక్కడివారు అక్కడే కొనసాగుతారు.  

* ఇక సచివాలయం, శాఖాధిపతులు, లెజిస్లేచర్లు, రాష్ట్ర స్థాయి కార్యాలయాలు, సంస్థలలో పనిచేసే ఉద్యోగులను జనాభా ప్రాతిపదికన విభజిస్తారు.  ఆ కార్యాలయాలలో కేటాయించి ఉద్యోగుల సంఖ్య మంజూరైన పోస్ట్ ల కన్నా ఎక్కువగా ఉండరాదు.  

* కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ లలో పనిచేసేవారి భట్వారా జరగదు.  

* తాత్కాలిక పదవులలో పనిచేస్తున్నవారు అప్పాయింటెడ్ డే కి ముందుగా తమ తమ రెగ్యులర్ పోస్ట్ లలోకి వెళ్ళిపోవాలి.  

* కొత్త  పోస్ట్ ల మంజూరు, పదోన్నతుల విషయంలో కొత్త ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటాయి.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles