T congress leaders blamed by rahul gandhi for failure

T Congress leaders blamed by Rahul, Rahul Gandhi blames T Congress leaders for failure, T Congress leaders meet Sonia Rahul, T Congress leaders apologize for failure in Telangana

T Congress leaders blamed by Rahul Gandhi for failure

తెలంగాణా కాంగ్రెస్ నేతల మీద విరుచుకుపడ్డ రాహుల్

Posted: 05/24/2014 10:31 AM IST
T congress leaders blamed by rahul gandhi for failure

తెలంగాణా కాంగ్రెస్ నేతలు శుక్రవారం సోనియా రాహుల్ గాంధీలను కలవటానికి వెళ్ళారు.  అయితే వాళ్ళని చూడగానే రాహుల్ విరుచుకుపడ్డారు.  తెలంగాణా ఇస్తే చాలు 15 మంది ఎంపీలు, 100 మంది ఎమ్మెల్యేలు గ్యారెంటీ అన్నారు ఏమైంది, మీరే ఓడిపోయారు, మమ్మల్ని బాగా మోసం చేసారంటూ రాహుల్ గాంధీ తెలంగాణా కాంగ్రెస్ నాయకులను నిలదీసారాయన.  

పొన్నం ప్రభాకర్, మధు యాష్కీ గౌడ్, సిరిసిల్ల రాజయ్య, వివేక్, సురేశ్ పెట్కార్, గుత్తా సుఖేందర్ రెడ్డి, నరేశ్ జాదవ్ లు తాము కాంగ్రెస్ ని గెలిపించలేకపోయామని అధిష్టానానికి క్షమాపణలు చెప్పటానికే అసలు ఢిల్లీ వెళ్ళారు.  అయితే అందుకు వాళ్ళు చెప్పిన కారణాలు అధిష్టానానికి మరింత కోపం తెప్పించాయి.  మోదీ హవా ఉందని, పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ కి వ్యతిరేకంగా మాట్లాడటం తెరాస కు లాభం చేకూర్చిందని, సరైన నాయకత్వం లేకపోవటం లోపమని ఇలా చెప్పుకొచ్చారు తెలంగాణా నాయకులు.  

మోదీ హవా అనగానే మండిపడ్డ రాహుల్, అయితే కెసిఆర్ ఎలా గెలిచాడు అని అడిగారు.  పవన్ కళ్యాణ్ ప్రచారం, అన్నదానికి, నాయకత్వం లేదు అన్నదానికి, తెలంగాణా ఇస్తే చాలు మరేమీ అక్కర్లేదని అన్నారు మీరు.  తెలంగాణా ఇచ్చాం కానీ మీరు దాన్ని ప్రజల్లోకి తీసుకునివెళ్లటంలో విఫలమయ్యారు.  అందువలన మేమేం ప్రచారం చేసుకోవలసివచ్చింది అన్నారు రాహుల్.  

తెలంగాణా కోసం మేము ఎంతో పోరాడితే మీరు అందులో పనిచెయ్యనివాళ్ళకి నాయకత్వం అప్పగించారు.  ప్రచారంలో మమ్మల్ని పట్టించుకోలేదు అని తెలంగాణా నాయకులు అధిష్టానాన్ని తప్పుపట్టారు.  ముఖ్యమంత్రి పదవికి ఏకంగా డజన్ మంది పోటీ పడ్డారని, సీమాంధ్రకి చెందిన కెవిపి రామచంద్రరావు ఎమ్మల్యే ఎంపీ అభ్యర్థుల ఎంపిక చేసారని ఆరోపించారు.  పైగా, ప్రచారంలోకూడా కెసిఆర్ లాగా సీమాంధ్రులను కించపరుస్తూ మాట్లాడలేకపోవటానికి కారణం ఇరు ప్రాంతాలలోను కాంగ్రెస్ పార్టీ ఉండటమేనని కూడా చెప్పుకొచ్చారు.  

అయితే ఇంత గంభీరంగా రాహుల్ తో మాట్లాడినవాళ్ళు సోనియా దగ్గరకు పోయేసరికి నీరుగారిపోయారు.  వెళ్తూనే ఖిన్న వదనాలతో గద్గద స్వరాలతో, మమ్మల్ని క్షమించండి, తెలంగాణా ఇచ్చినా పార్టీని గెలిపించలేకపోయామంటూ ప్రాధేయపడ్డారు.  

మేము ఇమ్మంటే తెలంగాణా ఇచ్చారు సరే కానీ, మేము ఇమ్మన్నప్పుడు ఇచ్చారా, మీ ఇష్టమొచ్చినప్పుడు మీరు ఆ పని చేసారు, అదే పని మొదట్లోనే చేసుంటే కెసిఆర్ హీరో అయ్యే అవకాశం ఉండేది కాదు గదా.  అసలు మీరు ఏమనుకుంటున్నారో మాకు చెప్పకుండా, మాకు ఏమీ అర్థం కాకుండా, వెనక్కి వెళ్లి ప్రజలకు ఏం చెప్పాలో అర్థం కాక, కెసిఆర్ చేత కూడా మాటలు అనిపించుకుని, సంవత్సరాలు గడిపాం.  మాకేమైనా తెలిస్తే కదా అక్కడ చెప్పటానికి.  అందుకని ముఖం చాటేసుకునే తిరిగాం.  రాజీనామాలు చెయ్యాలనే ఒత్తిడి కెసిఆర్ నుంచి ఏ స్థాయిలో వచ్చిందో మీకు తెలియంది కాదు.  మేము ఎప్పుడు ఢిల్లీ వచ్చినా, తెలంగాణతో తిరిగి రాకుంటే ప్రజలు మిమ్మల్ని గ్రామాల్లోకి రానివ్వరంటూ కెసిఆర్ ఎత్తిపొడుపులు భరించాం.  మీ వల్లనే కదా కాంగ్రెస్ నాయకులు కొందరు విసుగెత్తి తెరాస లో కలిసిపోయారు అని ఘాటుగా చెప్దామనుకున్న మాటలన్నీ వాళ్ళ గొంతులోనే ఆగిపోయాయి.  ఏమీ చెప్పలేకపోయారు.  ఎంతైనా అధిష్టానం కదా! 

"సరే, అయిపోయిందేదో అయిపోయింది.  ఇప్పటికైనా కష్టపడి పనిచేసి పార్టీకి మంచి పేరు తీసుకుని రండి" అన్నారు సోనియా.  బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్!

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles