Gold rate may come down

Gold rate may come down, Gold rate come down by Diwali, India Bullion and jewelers Association, Gold import duty reduced

Gold rate may come down

బంగారం ధర తగ్గే అవకాశం!

Posted: 05/23/2014 09:38 AM IST
Gold rate may come down

బంగారంలాంటి మాట చెప్పారు అనుకుంటున్నారా.  రాబోయే ప్రభుత్వం బంగారం దిగుమతులను సరళీకృతం చెయ్యటంతో దీపావళి వరకు పది గ్రాముల ధర 23000 నుంచి 24000 వరకు కుదించబడవచ్చని అంచనా.  బంగారం ధర అంతర్జాతీయ ధరలతో సమానంగా దిగవచ్చని ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మోహిత్ కాంబోజ్ అన్నారు.  

ఆభరణాల ఎగుమతిని పెంచే దిశగా బుధవారం నాడు కొన్ని ఎంపిక చేసిన ట్రేడింగ్ హౌస్ లకు కూడా బంగారాన్ని దిగుమతి చేసుకోవటానికి అనుమతులివ్వటం జరిగింది.  అందులో 20 శాతం బంగారాన్ని ఆభరణాల రూపంలో ఎగుమతి చెయ్యవలసివుంటుంది.

దిగుమతుల మీద సుంకాన్ని తగ్గించటం వలన అదనపు భారం తగ్గి బంగారం రేటు తగ్గవచ్చని, దానితో పాటు దొంగతనంగా భారత భూభాగంలోకి వస్తున్న బంగారం కూడా ఆగిపోతుందన్న ఆశాభావంతో అధికారులు వ్యవహరిస్తున్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles