Kcr addresses telangana employees unions

KCR addresses Telangana employees unions, KCR warns about Andhras in Telangana Secretariat, KCR wants Telangana Secretariat free of Andhra employees

KCR addresses Telangana employees unions

సచివాలయంలో కల్తీలొద్దు- కొట్లాడటానికైనా సిద్ధం- కెసిఆర్!

Posted: 05/23/2014 10:39 AM IST
Kcr addresses telangana employees unions

తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు, నవ్య తెలంగాణా రాష్ట్రానికి కాబోయే మొదటి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఉద్యోగుల పంపిణీ విషయంలో ఆంధ్రా ఉద్యోగులను ఉద్దేశించి గురువారం తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేసారు.  తెలంగాణా ఉద్యోగులు తెలంగాణాలోనే ఉండాలని, ఆంధ్రా ఉద్యోగులు ఆంధ్రాలోనే ఉండాలని మొదటి నుంచి చెప్తునేవున్నం కదా, తెలంగాణా సచివాలయంలో కల్తీలు వద్దు, సీమాంధ్ర ఉద్యోగులను బలవంతంగా రుద్దితే వాళ్ళని గేటు దాటనివ్వం అని అన్నారు.  

ఉద్యోగ సంఘాల సమావేశంలో మాట్లాడిన కెసిఆర్ తెలంగాణాలోని రహస్యాలను ఆంధ్రా ఉద్యోగులు బయటపెట్టే ప్రమాదముందని హెచ్చరించారు.  సచివాలయం, ఇంటెలిజెన్స్ లాంటి కీలకమైన శాఖలలో ఆంధ్రావాళ్ళకి చోటివ్వగూడదని అన్నారు.

తెలంగాణా సచివాలయంలో సిఎం తెలంగాణా, ప్రధాన కార్యదర్శి తెలంగాణా, ఉద్యోగులు మాత్రం ఆంధ్రోళ్ళు.  ఇగ చూస్కో ఎట్లుంటదో.  కలిసే ముచ్చటేనా.  పిచ్చోణ్ణి అడిగినా చెపుతడు అది పనికిమాలిన సంగతని.  బలవంతంగా 50 మందినో 100 మందినో ఆంధ్రోళ్ళను రుద్దుతరు.  వాళ్ళని సెక్రటేరియట్ లో ఉంచుతమా.  గేటు దాటనివ్వం.  వేరే చోట వేస్తం.  తెలంగాణా సెక్రటేరియట్ లో కల్తీలుండటానికి వీల్లేదు.  ఇందులో చర్చ లేదు, రాజీ లేదు ఇది ఫైనల్ అని తేల్చి చెప్పేసారాయన.  

సీమాంధ్ర అధికారులు, రాజకీయనాయకులు, ఉద్యోగ సంఘాల నేతలను ఉద్దేశిస్తూ, ఇప్పటిదాకా లక్షలాది ఉద్యోగాలు పోతుంటే తెలంగాణా ఉద్యోగులు ఓర్చుకున్నరు.   ఇక ఇప్పు కొట్లాటలకైనా రెడీ అన్నారు కెసిఆర్.  

అంతేకాదు, మీమీ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఆంధ్రావాళ్ళ పేర్లను జూన్ రెండు లోపులో ఇవ్వండి అని అందరికీ చెప్పారు కెసిఆర్.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles