Modi twitter rank order of obama downplayed by us

Modi twitter rank order of Obama, US downplays Modi twitter rank order, Modi invited to US by Obama, Modi can travel on A1 Visa

Modi twitter rank order of Obama downplayed by US

ట్విట్టర్ ర్యాంక్ ఆర్డర్ ని పట్టించుకునే అవసరం లేదు

Posted: 05/20/2014 01:04 PM IST
Modi twitter rank order of obama downplayed by us

దేశంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ విజయోత్సవంలో పాలుపంచుకుంటూ విదేశాలనుంచి అభినందన పరంపరలు వెల్లువెత్తిన సందర్భంగా నరేంద్రమోదీ ట్విట్టర్ ర్యాంక్ ఆర్డర్ విషయంలో పట్టించుకోవలసిన అవసరం లేదని యుఎస్ అంటోంది.  రష్యన్ ప్రధాని పుతిన్ లాంటి అంతర్జాతీయ నాయకులు పంపించిన అభినందనలకు తన ట్విట్టర్ లో ఒబామా గురించి చాలా ఆలస్యంగా ప్రస్తావించటం జరిగింది.  

మోదీ ప్రాధాన్యతల జాబితాలో యుఎస్ ప్రెసిడెంట్ దిగువలో ఉండటం యుఎస్ కి ఇబ్బంది కలిగిస్తుందా అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా, అమెరికా భారతల మధ్య ఉన్న సంబంధం చాలా పటిష్టమైనదని, దాని ముందు ట్విట్టర్ ర్యాంక్ ఆర్డర్ కి ప్రాధాన్యతనివ్వవలసిన అవసరం లేదని యుఎస్ అధికార ప్రతినిధి జెన్ ప్సాకి అన్నారు.  అమెరికా భారత ల చెలిమి చాలా గొప్పదని, అది భవిష్యత్తులో ఇంకా బలోపేతమవుతుందని ప్సాకి అన్నారు.  

మోదీ తన ట్విట్టర్లో తనకు అభినందనలు తెలియజేసిన స్టేట్ సెక్రటరీ జాన్ కెర్రీ కి సమాధానంగ కృతజ్ఞతలు తెలియజేస్తూ, రెండు శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశాల మధ్య గల సంబంధాన్ని మరింత పటిష్టం చేద్దామని రాసారు.  

మోదీని ఒబామా అమెరికాకు ఆహ్వానించారని, దేశ నాయకుడిగా ఆయనకు ఎ1 వీసా మీద ప్రయాణం చేసే అర్హత ఉందని ప్సాకి తెలియజేసారు.  2005లో తన వీసాను తిరస్కరించిన అమెరికాతో మోదీ కాస్త ముభావంగానే ఉంటున్నారు.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles