Mim announces support to trs

MIM announces support to TRS, MIM TRS work together, MIM TRS join for Hyderabad development, MIM President Asaduddin Owaisi supports TRS

MIM announces support to TRS for the development of Hyderabad

హైద్రాబాద్ అభివృద్ధికి తెరాస ఎమ్ఐఎమ్ కలిసికట్టుగా!

Posted: 05/19/2014 05:36 PM IST
Mim announces support to trs

తెలంగాణా రాష్ట్ర సమితి నాయకుడు కె తారకరామారావు ఈ రోజు మజ్లిస్ ఏ ఇత్తెహదూల్ ముస్లిమీన్ (ఎమ్ఐఎమ్) నాయకులతో సంప్రదింపులు జరిపారు.  ఆ తర్వాత మీడియాలో మాట్లాడిన కెటిఆర్, హైద్రాబాద్ అభివృద్ధి కోసం కలిసి పనిచెయ్యటం కోసం ఎమ్ఐఎమ్ నాయకులతో సమావేశమయ్యామని, అందుకు ఆ పార్టీ నాయకుల నుంచి అనుకూల స్పందన లభించిందని అన్నారు.

ఎమ్ఐఎమ్ అధ్యక్షుడు, హైద్రాబాద్ కి వరుసగా మూడుసార్లు ఎన్నికైన లోక్ సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ, తెలంగాణా, హైద్రాబాద్ లను అభివృద్ధి చెయ్యటం కోసం తెరాస తో కలిసి పనిచేస్తామని ప్రకటించారు.  

త్వరలో ఎమ్ఐఎమ్ నాయకులు తెలంగాణా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చెయ్యబోతున్న కె చంద్రశేఖరరావుని కలుస్తారని కెటిఆర్ అన్నారు.  హైద్రాబాద్ అభివృద్ధే లక్ష్యంగా ఎమ్ఐఎమ్ తో జతకడుతున్నామని కెటిఆర్ స్పష్టం చేసారు.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles