Bjp making record in 2014 elections

BJP making record in 2014 elections, Elections 2014 results, BJP sweep in 2014 elections, Clean sweep of BJP in 6 states

BJP making record in 2014 elections

చరిత్ర సృష్టిస్తున్న భాజపా !

Posted: 05/16/2014 04:46 PM IST
Bjp making record in 2014 elections

ఇంతవరకు 5 రాష్ట్రాలలోను, 4 కేంద్రపాలిత ప్రాంతాలలోను అన్ని పార్లమెంటు సీట్లనూ కైవసం చేసుకుని భారతీయ జనతా పార్టీ కొత్త చరిత్రను సృష్టించింది. ఢిల్లీలోని 7, గోవాలోని 2, గుజరాత్ లోని 26, రాజస్తాన్ లోని 25, ఉత్తరాఖండ్ లోని 5 స్థానాలను, భాజపా పూర్తిగా తన సొంతం చేసుకుంది. అలాగే కేంద్రపాలిత ప్రాంతాలైన అండమాన్, చండీగఢ్, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యులను కూడా భాజపా తన ఖాతాలో వేసుకుంది. బీహార్ లో,అస్సాంలోను క్లీన్ స్వీక్ కి దగ్గర్లో ఉంది. మహారాష్ట్రలోను, హర్యానాలోను అధికశాతం గెలుచుకోవటమే కాకుండా ఇంకా చాలా స్థానాల్లో ముందంజలో ఉంది.

ఇప్పటి వరకు భాజపాకు ఎంత మద్దతునిచ్చారో అలాగే ఐదు సంవత్సరాలు సహయోగాన్ని అందించినట్లయితే దేశం అభివృద్ధి పథంలో నడుస్తుందని అన్న వసుంధరా రాజే సింధియా, కాంగ్రెస్ నుండి దేశానికి విముక్తి లభించాలని కోరుకున్నట్లుగానే జరుగుతోందని అందుకు తన ఆనందాన్ని తెలియజేసారు.

విదిష నుంచి పోటీ చేసి గెలిచిన సుష్మా స్వరాజ్, పార్టీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్, సీనియర్ నేత అద్వానీ కూడా భాజపా గెలపుకు ఆనందాన్ని వ్యక్తం చేసారు. ఈ సందర్భంలో ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడిన రాజ్ నాథ్ సింగ్, ఈ అఖండమైన చారిత్రాత్మకమైన గెలుపును అందించిన భారతవాసులు తమ మీద ఎంతో గురుతరమైన బాధ్యతను పెట్టారని అన్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles