Modi asks rss for free hand

Modi asks RSS for free hand, BJP Prime Ministerial candidate Modi, Narendra Modi wants free hand to run Govt

Modi asks RSS for free hand in forming government

నాకు స్వేచ్ఛనివ్వండి- ఆర్ఎస్ఎస్ కి మోదీ వినతి!

Posted: 05/16/2014 08:25 AM IST
Modi asks rss for free hand

భారతీయ జనతా పార్టీ వెనక ఉన్నది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అని అంతకు ముందు ఇతర పార్టీలు ఆరోపణలు చేస్తూవుండేవి. కానీ ఈసారి బాహాటంగా రంగంలోకి దిగటంతో అది రహస్యం పోయి తేటతెల్లమైపోయింది. ఆర్ఎస్ఎస్ వెన్నంటి వుండబట్టే భాజపాలో అంతర్యుద్ధాలు రాకుండా ఇంతవరకు నెగ్గుకొచ్చారు కానీ ప్రతిదానిలో కలుగజేసుకుంటే పార్టీకి కష్టమౌతుందన్న అభిప్రాయానికి వచ్చినట్టున్నారు, నరేంద్ర మోదీ మంత్రివర్గాన్ని ఏర్పాటు చెయ్యటంలో మాత్రం కలుగజేసుకోవద్దని ఆర్ఎస్ఎస్ ని కోరినట్లుగా సమాచారం.

అసలు మోదీకి ఎదురు లేకుండా ప్రధానమంత్రి అభ్యర్థిగా పూర్తి మద్దతు రావటానికి ఆర్ఎస్ఎస్ కలుగజేసుకోవటమే కారణం. లేకపోతే అద్వానీ లాంటి నేతలు భాజపాను ఇంతవరకు ఒక త్రాటి మీద ఇంతదూరం రానిచ్చేవారు కాదు. అయితే ఆ పని అయిపోయింది, ఇక ప్రభుత్వాన్ని నడపటమే మిగిలివుంది కాబట్టి అందులో కూడా వేలు పెట్టకుండా ఉండాలన్న తన అభిమతాన్ని నరేంద్ర మోదీ వెలిబుచ్చుతూ, తనకు ప్రభుత్వాన్ని నడపటంలో స్వేచ్ఛనివ్వమని ఆర్ఎస్ఎస్ ని కోరినట్లుగా తెలుస్తోంది.

-శ్రీజ

నాకు స్వేచ్ఛనివ్వండి- ఆర్ఎస్ఎస్ కి మోదీ వినతి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles