Ready for new government in seemandhra and telangana

new government in seemandhra, new government in telangana, AP Lok Sabha and Assembly Elections 2014 Results, Lok Sabha Election 2014 Results, AP Assembly Elections 2014 Results, Telangana, Seemandhra MP and MLA Elections Results 2014, AP Lok sabha Elections Results 2014, AP Assembly Elections Results 2014, Seemandhra Assembly Elections Results 2014, Telangana Assembly Elections Results 2014, General elections results 2014, Elections 2014, elections results, 2014 Lok Sabha polls Results, Poll Results, Lok Sabha election results, assembly election results

ready for new government in seemandhra and telangana

రెడీ..రెడీ..సీమాంధ్ర, తెలంగాణ..కొత్త ప్రభుత్వాలకు

Posted: 05/16/2014 08:11 AM IST
Ready for new government in seemandhra and telangana

అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో 42 లోక్‌సభ, 294 అసెంబ్లీ స్థానాలకు ఓట్ల లెక్కింపు ఈరోజు జరగనుంది. విభజనానంతరం కొత్త ప్రభుత్వాలతో తెలంగాణ, సీమాంధ్ర రాష్ట్రాలు అవతరించనున్నాయి. భాషా ప్రాతిపదికన ఏర్పడిన తొలి రాష్ట్రంగా పేరొందిన సంయుక్త ఆంధ్రప్రదేశ్‌లో రెండు విడతలుగా తెలంగాణ ప్రాంతంలో ఏప్రిల్ 30న, సీమాంధ్రలో మే ఏడో తేదీన జరిగిన ఎన్నికలు చివరి ఎన్నికలుగా చరిత్రలో నిలిచిపోతాయి.

పది జిల్లాలలతో కూడిన తెలంగాణ జూన్ రెండో తేదీన భారతదేశపు 29వ రాష్ట్రంగా ఆవిర్భవిస్తుంది. ఓట్ల లెక్కింపు ఫలితాలు ఇరు ప్రాంతాల్లో విస్తృతమైన రాజకీయ సమీకరణాలను మారుస్తుంది. గెలుపొందిన అభ్యర్థులు విభజనానంతర ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తొలి అసెంబ్లీల సభ్యులుగా మారుతారు. ఆ సందర్భం చాలా మందికి భావోద్వేగాన్ని కలిగిస్తుంది.

ఇటీవల ముగిసిన ఎన్నికలు తెలంగాణాలో కాంగ్రెస్, టిఆర్ఎస్ అలాగే సీమాంధ్రలో టిడిపి-బిజెపి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్య ప్రధాన పోరాటంగా మారాయి. తెలంగాణ ప్రాంతంలోని 17 లోక్‌సభ, 119 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 30న, సీమాంధ్రలోని 13 జిల్లాల్లో 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాలకు మే ఏడో తేదీన ఎన్నికలు జరిగాయి. 2009 ఎన్నికల్లో మొత్తం 42 లోక్‌సభ స్థానాలకు 33 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ ఈ సారి సీమాంధ్రలో దాదాపుగా తుడిచిపెట్టుకు పోయినట్లుగా కనిపిస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌ను విభజిస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశగా పార్టీ సాగడం సీమాంధ్రుల ఆగ్రహానికి కారణమైంది. కాంగ్రెస్ పార్టీ సీమాంధ్ర ప్రాంతంలో పెను ఓటమిని చవిచూస్తోందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీమాంద్ర రాష్ట్రానికి సిఎంగా అయ్యే ఛాన్స్ ఉంది.

అలాగే తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా.. తెలంగాణ రాష్ట్ర సమితి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఛాన్స్ దక్కే.. అవకాశాలు 1000% ఉన్నాయి. ఇక ప్రజల తీర్పు ఎలా ఉంటుందో మరొ కొన్ని గంటల్లో తెలిసిపోతుంది.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles