Cathelic priest deported from us

Cathelic priest deported from US, Koppala Cathelic priest in Us deported, Nellore based Koppala deported from US, Cathelic priest molest case in US

Cathelic priest deported from US of sexual assault charge

క్యాథలిక్ ప్రీస్ట్ యుఎస్ నుంచి దేశ బహిష్కరణ

Posted: 05/15/2014 06:45 PM IST
Cathelic priest deported from us

48 సంవత్సరాల భారతదేశానికి చెందిన కేథలిక్ ప్రీస్ట్ ని 13 సంవత్సరాల బాలిక మీద అత్యాచారం చేసిన నేరం మీద ఆ దేశం నుంచి బహిష్కరించి భారత్ కి పంపించేస్తోంది.  లియో ఛార్లెస్ కొప్పాల ను విమానాశ్రయం తీసుకుని వచ్చిన యుఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్పోర్స్ మెంటు అధికారులు మే 14 న భారత అధికారులకు అప్పజెప్పారు.  

సెకండ్ డిగ్రీ క్రిమినల్ సెక్సువల్ కాండక్ట్ కింద జూన్ 8 2012 లో కొప్పాలను అరెస్ట్ చేసినపుడు బాధితురాలి వయసు 12 సంవత్సరాలు.  ఆ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చిన కొప్పాల ను మార్చి 31 నాడు దోషిగా కోర్టు నిర్ణయించగా, ఏప్రిల్ 1 నాడు ఇమిగ్రేషన్ అధారిటీ ఆయన బహిష్కరణకు ఆదేశాలిచ్చింది.  అర్కిడియోసిస్ ది వినోనాలో పనిచేసిన కొప్పాలను మినిస్ట్రీ నుంచి తొలగించారు.  ఆయన ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరుకి చెందినవాడవటం వలన ఈ విషయంలో నెల్లూరులోని బిషప్ కి కూడా  ఈ సమాచారాన్ని అందజేసారు.  

కొప్పాల కేథలిక్ చర్చ్, సమాజంలో ఉన్న విశ్వాసాన్ని పోగొట్టుకున్నారని, ఆయనను దేశం నుంచి బహిష్కరించటం వలన బాధితురాలికి ఉపశమనం కలుగుతుందని నమ్ముతున్నామని ఇఆర్వో డైరెక్టర్ సైంట్ పాల్ అన్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles