Loksabha secretariat ready for new mps

Loksabha secretariat ready for new MPs, Help desks and brief cases for new MPs, 16th Loksabha results, Handbook of rules and regulations of Parliament, Residence to new members of parliament

Loksabha secretariat ready for new MPs

ఎంపీలకోసం బ్రీఫ్ కేసులు రెడీ!

Posted: 05/15/2014 06:15 PM IST
Loksabha secretariat ready for new mps

16 వ లోక్ సభ ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెలివడనున్నాయి.  పార్లమెంట్ స్థానాలకోసం పోటీ చేసిన అభ్యర్థులు ఆ ఫలితాలకోసం ఎదురుచూస్తూవుండగానే పార్లమెంట్ లో దిగువ సభ సభ్యులకోసం లోక్ సభ సెక్రటేరియట్ కొత్త ఎంపీలకోసం సర్వం సిద్ధం చేసింది.  ఇంకా 24 గంటల సమయం ఉండగానే పార్లమెంటుని పరిశుభ్రంగా తయారుచెయ్యటంతో పాటు కొత్తగా వచ్చే సభ్యుల కోసం గ్రీన్ కార్పెట్ పరిచి అవగాహన కార్యక్రమానికి సిద్దంగా ఉంది. 

అందులో భాగంగో పార్లమెంట్ లో హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేసారు.  అవి మే 16 నుంచి 26 వరకు పనిచేస్తాయి.  మొదటి డెస్క్ లో ఎన్నికైన ఎంపీలు తాము తమ నియోజకవర్గం నుంచి ఎన్నికైనట్లుగా ఎలక్షన్ సర్టిఫికేట్ ని ఇవ్వవలసివుంటుంది. ఆ తర్వాత సభ్యులు సంబంధిత ఫారాన్ని నింపి, వారి స్పెసిమన్ సిగ్నేచర్ ని ఇవ్వవలసివుంటుంది.  దానితో వారు పార్లమెంటు సభ్యులుగా నమోదవుతారు.  సభ్యులకు తాత్కాలికంగా ఆకుపచ్చ రంగు ఐడీ కార్డ్, వాళ్ళ భార్య లేక భర్తలకు బ్రౌన్ రంగు ఐడి కార్డ్ లను జారీ చేస్తారు.  అవి మూడు నెలల వరకు చెల్లుతాయి.  ఎంపీగా ఇమెయిల్ ఐడి కోరిన వారికి తక్షణమే ఇవ్వబడుతుంది.  

లోక్ సభ సెక్రటరీ జనరల్ పి శ్రీధరన్ ఇచ్చిన వివరాల ప్రకారం, రెండవ డెస్క్ దగ్గర పార్లమెంట్ రికార్డ్ కోసం, పర్మనెంట్ ఐడి కోసం పార్లమెంట్ సభ్యుల ఫోటోగ్రాఫ్ తీసుకోబడుతుంది.  ఆ తర్వాత వాళ్ళకి బ్రీఫ్ కేసు ఒకటి ఇవ్వబడుతుంది.  అందులో పార్లమెంట్ నియమాలు విధి విధానాలను గురించి హాండ్ బుక్ ఉంటుంది.  

ఇక ప్రత్యేకమైన డెస్క్ దగ్గర వారి అధికారిక నివాసానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతాయి.  మొదటిసారి పార్లమెంట్ సభ్యులుగా వచ్చేవారికోసం వివిధ ప్రభుత్వ గెస్ట్ హౌస్ లు, ఐటిడిసి హోటల్ అశోక్ లో గదులను బుక్ చేసారు.  

15 వ లోక్ సభ చూసినన్ని సభా ఆటంకాలు గతంలో ఎప్పుడూ చూడలేదు.  గరిష్ట ప్రమాణంలో జరిగిన పార్లమెంట్ స్థంబనలు, సిగపట్లకు అదే ఆఖరి లోక్ సభ అవాలని ఆశిస్తూ, చూద్దాం ఈ సారి వచ్చే పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్ గౌరవాన్ని ఎంతవరకు కాపాడుతారో.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles