Priyanka bare foot pada yatra in rae bareli

Priyanka bare foot pada yatra in Rae Bareli, Lok Sabha elections 2014, Lok Sabha elections, India General Elections 2014, elections 2014, general elections 2014, parliament elections 2014, India elections 2014, Assembly Elections 2014,Lok Sabha Elections 2014 news, Lok Sabha Elections 2014 videos, Lok Sabha Elections 2014

Priyanka bare foot pada yatra in Rae Bareli

మరో సుడిగాలి, మారు ఇందిరా గాంధీ - ప్రియాంక

Posted: 04/29/2014 10:41 AM IST
Priyanka bare foot pada yatra in rae bareli

రాయబరేలీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రియాంకను సుడిగాలిగాను, మరో ఇందిరా గాంధీగానూ పార్టీ నాయకులు పొగుడుతూ నినాదాలు చెయ్యటానికి కారణం ప్రియాంక చెప్పులు తెగిపోవటం, ఆమె ఒట్టి కాళ్ళతో పాదయాత్రను కొనసాగించటమే.  అది కూడా మండుటెండలో.  

priyanka-vadraరాయబరేలీలో పాదయాత్రకు పూనుకున్న ఇందిరా గాంధీ మనుమరాలు ప్రియాంక నానమ్మ పోలికలను పుణికిపుచ్చుకున్నదని కాంగ్రెస్ అభిమానులంతా ఆనందపడుతుంటారు.  రాయబరేలీలో మధ్యాహ్నం 2.20 గంటలకు కాంగ్రెస్ ప్రదాన కార్యాలయం నుంచి పాదయాత్రకు బయలుదేరిన ప్రియాంక వాద్రా విషయంలో కూడా ఇందిరా గాంధీ సమయంలో లాగానే భద్రతా సిబ్బందికి ఆమె చుట్టూ మూగే జనాలను నియంత్రించటం కష్టసాధ్యమైన పనైంది.  గులాబ్ రోడ్ లో ఒకటిన్నర కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేసిన తర్వాత ఆమె చెప్పుల మీద ఎవరిదో కాలు పడింది.  అంతే ఆమె చెప్పు ఒకచి తెగిపోయింది.  వెంటనే రెండవ చెప్పుని కూడా వదిలి ఆమె పాద యాత్రను ముందుకు సాగించారు.  

గబగబా మార్కెట్ కి పోయిన కాంగ్రెస్ కార్యకర్తలు ఆమె కోసం కొత్త చెప్పుల జతను తెచ్చే లోపులో ఆమె 500 మీటర్ల దూరం కాలిపోతున్న ఎండలో నడిచి కాంగ్రెస్ కార్యకర్తలలో ఉత్సాహాన్ని నింపారు.  

రాయబరేలీ, అమేథీలలో ఇక కాంగ్రెస్ కి ఎదురు లేదని కాంగ్రెస్ పార్టీ సంతోషాన్ని వ్యక్తంచేసింది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles