3 firs on baba ramdev for honeymoon remark

3 FIRs on Baba Ramdev for honeymoon remark, Yoga guru Baba Ramdev remarks on Rahul Gandhi, Picnic and honeymoon of Rahul at Dalits, Ban on Baba Ramdev election campaigns

3 FIRs on Baba Ramdev for honeymoon remark

బాబా హనీమూన్ వ్యాఖ్య మీద నేడు పాట్నాలో విచారణ

Posted: 04/29/2014 10:03 AM IST
3 firs on baba ramdev for honeymoon remark

మాటన్న తర్వాత నాలిక కొరుక్కున్నా ప్రయోజనం ఉండదు కాబట్టి నేనా ఉద్దేశ్యంతో అనలేదు, రాజకీయ ఉద్దేశ్యంతో అన్న మాటలను వక్రీకరించారు అంటూ యోగా గురు బాబా రామ్ దేవ్ ఇప్పుడెంత నెత్తినోరు కొట్టుకుని అన్నా, ఉత్తర ప్రదేశ్ లో ఆయన మీద మూడు చోట్ల ఎస్ సి ఎస్ టి చట్టం కింద నమోదైన మూడు ఎఫ్ఐఆర్ లలో ఈరోజు పాట్నలో విచారణ జరుగనుంది.  రాహుల్ గాంధీ దళితుల గృహాలకు పిక్నిక్ చేసుకోవటానికి, హనీమూన్ లకు పోతున్నారంటూ ఆయన ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్యానించారు.  దానితో ఆయన అరెస్ట్ కి గురయ్యారు.

బాబా రామ్ దేవ్ వ్యాఖ్యలను తప్పుపడుతూ ఎన్నికల కమిషన్ కూడా ఆయన మీద ప్రచార నిషేధాజ్ఞలను జారీ చేసింది.  హిమాచల్ ప్రదేశ్, లక్నో, అమేథీలలో విధించిన నిషేధాజ్ఞలు ఎన్నికలు పూర్తయేంతవరకూ ఉంటాయని ఆదేశించినా, ఆయన హిమాచల్ లో మీడియా సమావేశాన్ని పిలిచి అందులో కాంగ్రెస్ పార్టీని తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ ఎన్నికల కమిషన్ ఆ పార్టీ గుప్పిట్లో ఉందని వ్యాఖ్యానించారు.  ఎన్నికల కమిషన్ ని స్పేచ్చగా పనిచేసుకోకుండా చేస్తోందని, ఓడిపోతున్న మనస్తాపంతో కాంగ్రెస్ పార్టీ తన యోగా క్లాసులను కూడా అడ్డుకుంటోందని అన్నారు.  

సోనియా గాంధీ రాహుల్ గాంధీలు కలిసి దేశాన్ని కొల్లగొట్టారని, వాద్రాని ధనవంతుడిని చేసారని బాబా విమర్శించారు.  సోనియా గాంధీ దళితులను అవమానపరుస్తోందని బాబా అన్నారు.

ఇలాంటి వ్యాఖ్యే నరేంద్ర మోదీ కూడా చేసారు కానీ ఆయన తనదైన వ్యంగ్య ధోరణిలో ఎవరినీ తప్పుపట్టకుండా వ్యాఖ్యానించారు.  నోట్లో వెండి చెంచాతో పుట్టిన రాహుల్ గాంధీకి పేదలు ఎలా ఉంటారో తెలియదు కాబట్టి వాళ్ళని వాళ్ళు కూడా రెండు చేతులు రెండు కాళ్ళతో ఉంటారా అని చూడటానికి పోయారన్నారాయన.  దానితో అట్టుడికి పోతున్న కాంగ్రెస్ పార్టీకి బాబా రామ్ దేవ్ మీద ఆ కసి తీర్చుకోవటానికి అవకాశం దొరికింది.  ఆయన మీద వెంటనే ఇసికి ఫిర్యాదులు, కోర్టులో కేసుల వరకూ వెళ్ళాయి.  

-శ్రీజ

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles