Rahul gandhi attacks k chandrasekhar rao

Rahul Gandhi, congress party, kcr, K Chandrasekhar Rao, telangana, Telangana Rashtra Samithi, trs, KCR will forget all promises.

Rahul Gandhi attacks K Chandrasekhar Rao, KCR will forget all promises

కేసిఆర్ వెన్నుపోటు-రాహుల్ గాంధీ హామీలు !

Posted: 04/21/2014 08:58 PM IST
Rahul gandhi attacks k chandrasekhar rao

తెలంగాణ జిల్లాలో పర్యటిస్తున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ టిఆర్ఎస్ పై విమర్శల దాడి చేశారు.  మహబూబ్ నగర్ జిల్లాలో ప్రసంగించిన అనంతరం నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం సాంపల్లిలో జరిగిన బహిరంగ సభలో రాహుల్ పాల్గొని ప్రసంగించారు. 

కేసీఆర్ రెండు నాల్కల ధోరణి అవలింబిస్తున్నాడని విమర్శించారు. ఇటీవల తెలంగాణ రాష్ట్రం ప్రకటించిన తరువాత కేసీఆర్ ఢిల్లీకి రావడం జరిగిందని గుర్తు చేశారు. అనంతరం తనతో ఐదు నిమిషాల వరకు మాట్లాడాడని పేర్కొన్నారు. అనంతరం నా చేతిని పట్టుకుని మీతో ఉంటానని వాగ్ధానం చేయడం జరిగిందన్నారు. 

అంతకుముందు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తరువాత టిఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేస్తానని చెప్పిన విషయం తెలిసిందేనని పేర్కొన్నారు. రూం నుండి బయటకు వెళ్లిన తరువాత ఆయన నా చుట్టూ తిరిగారని పేర్కొన్నారు. నా దగ్గరకు వచ్చి ఆలింగనం చేసుకుంటానని కేసీఆర్ చెప్పడం జరిగిందన్నారు. 

కేసిఆర్ ఆలింగనం చేసుకున్న తరువాత కూడా మీతోనే ఉంటానని చెప్పడం జరిగిందన్నారు. బయటకు వెళ్లిన తరువాత వాగ్ధానం విస్మరించారని రాహుల్ విమర్శించారు. 

అయితే కేసిఆర్  ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచిన వ్యక్తిగా కాంగ్రెస్ హైకమాండ్  గుర్తించిందని రాహుల్ గాంధీ అన్నారు. 

 

రాహుల్ హామీలు... 

*  పది సంవత్సరాల పూర్తిస్థాయి పన్ను మినహాయింపు.

*  4వేల మెగాప్లాంట్ తెలంగాణలో నెలకొల్పుతాం.

*  యువలోకానికి అవసరమైన అన్ని రకాలైన శిక్షణలు ఏర్పాటు చేస్తాం.

*  పేదలకు ఒక సురక్షితమైన గృహాన్ని కట్టిస్తాం.

*  ఉచితంగా మందులు, ఆపరేషన్ లు ఏర్పాటయ్యే విధంగా చేస్తాం.

*  మహిళల కోసం రెండు వేల పోలీస్ స్టేషన్ ల కోసం ఏర్పాటు చేస్తాం.

*  పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేస్తాం..

*  జంట నగరాల్లో ఆర్ధిక వనరులు తెలంగాణ ఆస్థిగా మిగులుతాయి.

*  అన్ని జిల్లాల్లో కూడా సమతుల్యమైన అభివృద్ధి సాధిస్తాం.

*  ప్రాణహిత – చేవెళ్ల, పాలమూరు ప్రాజెక్టులను జాతీయ ప్రాజెక్టులుగా ఏర్పాటు చేస్తాం.

ఆర్ఎస్ 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles