Modi pawan kalyan and chandrababu to share dais

narendra modi, pawan kalyan, chandrababu naidu, lok sabha election 2014, andhra pradesh assembly election 2014.

BJP prime ministerial candidate Narendra Modi will address three public meetings in Telangana and a fourth one in Hyderabad on April 22. The Hyderabad meeting will be under the NDA banner and will see the participation of TDP president Chandrababu Naidu

ఒకే వేదిక పై ముగ్గురు అధిపతులు

Posted: 04/22/2014 08:58 AM IST
Modi pawan kalyan and chandrababu to share dais

మరొకరేమో ముఖ్యమంత్రి పీఠం పై కూర్చోవడానికి ఉబలాట పడుతున్నారు. మరొకరేమో రాజకీయాల్లో మార్పును తీసుకొస్తానిని ఇటీవలే రాజకీయాల్లోకి వచ్చాడు. ఈ ముగ్గురు ఈ రోజు హైదరాబాద్ లో ఓ వేదిక పై రానున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నరేంద్ర మోడీ తెలంగాణ లో ఒకేరోజు నాలుగు సభలు నిర్వహించ బోతున్నారు.

ఈ సభా వేదికను మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి పంచుకోబోతున్నారు. నేడు నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, హైదరాబాదు సభల్లో మోడీ ప్రసంగిస్తారు. అందులో రెండు సభల్లో చంద్రబాబు, మరో రెండు సభల్లో పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తే... హైదరాబాద్  ఎల్బీ స్టేడియంలో జరిగే సభలో మాత్రమే ఈ ముగ్గురు కలిసి ప్రసంగించబోతున్నారు. ఈ సభ కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

‘‘ భారత్ విజయ్ సంకల్ప్ యాత్ర ’’ పేరిట జరిగే ఈ సభలో మధ్యాహ్నం 1.45 గంటలకు నిజామాబాద్, సాయంత్రం 3.15కు కరీంనగర్, 5 గంటలకు మహబూబ్‌నగర్, 6.15 గంటలకు హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరిగే సభల్లో మోడీ పాల్గొంటారు.

హైదరాబాద్‌లో జరిగే బహిరంగ సభలో ఈ ముగ్గురు నేతలు మాత్రమే ప్రసంగిస్తారని, తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి ముఖ్యనేతలకు స్వాగతం చెబుతారని తెలుస్తోంది. మొత్తం నాలుగు సభల్లో ఒక్కో చోట దాదాపు 25 నిమిషాలపాటు మోడీ ప్రసంగించనున్నారు. మొత్తానికి ముగ్గురు నేతలు కలిసి పాల్గొనున్న ఈ సభ పై చాలా మంది ఆసక్తి తో ఉన్నారు.

KNR

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles