Balakrishna files nomination at hindupuram

Balakrishna files nomination at Hindupuram, Basava Tharakam Cancer Hospital, Lok Sabha elections 2014, Lok Sabha elections, India General Elections 2014, elections 2014, general elections 2014, parliament elections 2014, India elections 2014, Assembly Elections 2014,Lok Sabha Elections 2014 news, Lok Sabha Elections 2014

Balakrishna files nomination at Hindupuram

నామినేషన్ వేసి హిందూపురం అభివృద్ధికి కంకణం కట్టుకున్న బాలకృష్ణ

Posted: 04/16/2014 02:07 PM IST
Balakrishna files nomination at hindupuram

తెలుగు దేశం పార్టీ తరఫున హిందూపురం అసెంబ్లీ సీటు దక్కించుకున్న నందమూరి బాలకృష్ణ ఈరోజు పండితులు నిర్ణయించిన ముహూర్తానికి తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలుచేసారు. 

కుటుంబ సభ్యులతో హైద్రాబాద్ నుంచి బెంగళూరు విమానంలో అక్కడి నుండి హిందూపురానికి రోడ్డు మార్గంలో చేరుకుని, అనుకున్న ప్రకారం స్థానిక ప్రముక దేవాలయమైన సుగూరు ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించి, ర్యాలీగా తరలివెళ్ళి నామినేషన్ దాఖలుచేసారు. 

తెదేపా నాయకులు, కార్యకర్తలు, మాజీ ఎమ్మల్యే అబ్దుల ఘనీతో పాటు సినీ అభిమానులు ఉత్సాహంగా పాల్గోన్న ఆ కార్యక్రమంలో నామినేషన్ పూర్తి చేసుకుని, హిందూపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని, రాష్ట్రంలోనే నెంబర్ వన్ గా చేస్తానని హామీ ఇచ్చారు.  హిందూపురంలో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ని స్థాపిస్తానని కూడా బాలకృష్ణ మాటిచ్చారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles