Cobrapost sting operation on babri masjid demolition

Cobrapost sting operation on Babri Masjid demolition, Bharatiya Janataparty, Sangh parivar, Babri Masjid, Ram Janmabhoomi, Planned demolition Ram Janmabhoomi

Cobrapost sting operation on Babri Masjid demolition

బాబ్రీ మస్జీద్ కూల్చివేత మీద కోబ్రా పోస్ట్ స్టింగ్ ఆపరేషన్

Posted: 04/04/2014 11:18 AM IST
Cobrapost sting operation on babri masjid demolition

డిసెంబర 6, 1992 ల జరిగిన బాబ్రీ మస్జీద్ కూల్చివేత పైకి చెప్తున్నట్లుగా అప్పటికప్పుడు వచ్చిన భావోద్రేకాల వలన జరిగింది కాదని, నెలల తరబడి చేసిన పథకం ప్రకారం చేసిన పనేనని, అప్పటి రాజకీయ నాయకులకు కూడా అంతా తెలుసని కోబ్రాపోస్ట్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ వలన తెలిసిందంటూ చెప్తోంది. 

అయోధ్యలో జరిగిన బాబ్రీ కూల్చివేత మీద పరిశోధన చేసి పుస్తకాన్ని రాస్తున్న రచయితగా వెళ్ళి వివరాలు గ్రహించిన కోబ్రాపోస్ట్ అసోసియేట్ ఎడిటర్ కె అశిష్ అయోధ్య, ఫైజాబాద్, తండా, లక్నో, గోరఖ్ పూర్, మథురా మొరాదాబాద్, జైపూర్, ఔరంగాబాద్, ముంబై, గ్వాలియర్ లలో 23 మంది కీలకమైన వ్యక్తులను కలిసి వాళ్ళు ప్రకటించిన సత్యాలను రికార్డ్ కూడా చేసామని చెప్తున్నారు. 

వివిధ వ్యక్తులతో జరిపిన సంభాషణలలోంచి ఏరి తీసినట్లయితే రామ్ జన్మ భూమి కాండ వెనక అసలు సత్యమేమిటో తెలిసిందని, ఆపరేషన్ జన్మభూమి పేరుతో నెలల తరబడి రిహార్సల్స్ వేసి సునిశిత దృష్టితో తయారు చేసిన పథకం ప్రకారం 16 వ శతాబ్దంనాటి కట్టడాన్ని నేలకూల్చారని తెలుస్తోందంటోంది కోబ్రాపోస్ట్.  కట్టడాలను కూల్చటంలో సుశిక్షుతులైనవారు ఈ బృందంలో చేర్చబడ్డారట.  38 మందితో కూడిన లక్షణసేన ప్రత్యేకంగా కట్టడాల పైకి హుక్స్ తాళ్ళను ఉపయోగించి అధిరోహించేవాళ్ళతోను, కట్టడాలను కూల్చటంలో సిద్ధహస్తులతోను తయారైందట.  కట్టడాన్ని పేల్చటానికి డైనమేట్లను కూడా వెంటతీసుకుని పోయారట. 

కోబ్రాపోస్ట్ చేసిన స్టింగ్ ఆపరేషన్ లో, ఆపరేషన్ రామ్ జన్మ భూమి లో కీలకపాత్ర వహించిన సాక్షి మహరాజ్, ఆచార్య్ ధర్మేంద్ర, ఉమా భారతి, మహంత్ వేదాంతి, వినయ్ కట్యార్ లకు, ఎల్ కే అద్వాని లాంటి భాజపా అగ్రనేతలకి, అప్పటి ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ కి, అప్పటి ప్రధాన మంత్రి పివి నరసింహారావుకి కూడా ఈ విషయం ముందుగానే తెలుసని అర్థమౌతోందని కూడా కోబ్రా పోస్ట్ చెప్తోంది. 

అంతే కాదు ఈ పథకం ఎంత పటిష్టంగా తయారైందంటే, కొందరు హిందువులు అసువులు బాయకపోతే ఉద్యమరూపం దాల్చదన్న ఉద్దేశ్యంతో 1990 కరసేవలో పోలీసులను రెచ్చగొట్టి కాల్పులు జరిపించటం జరిగిందని కూడా కోబ్రాపోస్ట్ చెప్తోంది.  ఇంటర్వ్యూలో చాలా మంది తాము చేసినదాన్ని గొప్పగా చెప్పుకుంటున్నట్లుగా తెలుస్తోంది. 

రామభక్తులంతా చెయ్యి లేక చావు అనే సంకల్పం తీసుకుని ఈ విధంగా శపథం చేసారట- ఈరోజు డిసెంబర్ 6 న మేము రామభక్తులమంతా కలిసి రామ్ లల్లా ప్రాంగణంలో చేసే శపథం ఏమిటంటే, ప్రస్తుతమున్న కట్టడాన్ని తొలగించి ఆ స్థానంలో పెద్ద రామ మందిరాన్ని నిర్మించటం అవసరం కాబట్టి ఈ రామ్ జన్మ భూమి మందిరాన్ని కూల్చటం అవసరం.  రామ్ లల్లా మీద మేమీ శపథం చేస్తున్నాం.

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ కి ఒకరోజు ముందుగా ఈ పథకమంతా తెలియటంతో ఆయన ముందుగానే రాజీనామా చెయ్యటానికి సిద్ధమయ్యారట.  కానీ హెచ్ వి శేషాద్రి, మురళీ మనోహర్ జోషి లాంటి సీనియర్ నాయకులు వారించారట.  అంతేకాకుండా పథకం ప్రకారం మొత్తం అమలు జరిగేంతవరకూ ఆయనను రోజంతా బందీగా ఉంచారట కొందరు భాజపా నాయకులు. 

ఇదంతా కోబ్రాపోస్ట్ తన స్టింగ్ ఆపరేషన్ లో తేలిన విషయాలుగా చెప్తోంది.

ప్రతిస్పందనగా, 22 సంవత్సరాల క్రితం జరిగిన ఉదంతాన్ని ఇప్పుడు కొత్తగా దర్యాప్తు చేసినట్లుగా ఎన్నికలకు రెండు రోజుల ముందు కోబ్రాపోస్ట్ వెల్లడించటమనేది కేవలం రాజకీయ ప్రయోజనం కోసం కాంగ్రెస్ ఆడిస్తున్న నాటకమేనని భాజపా ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేసింది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles