Low intensity vibration good for healing

Low intensity vibration good for healing, Yoga, Healing power in body system, body energy, diabetic patients, Diabetes type 2

Low intensity vibration good for healing

వైబ్రేషన్ తో గాయాలు నయమౌతాయా?

Posted: 04/01/2014 02:54 PM IST
Low intensity vibration good for healing

టైప్ 2 చక్కెర వ్యాధి వలన పాదాలకు అయ్యే గాయాలు త్వరగా నయం కాకపోవటమే కాక అవి భీభత్సంగా తయారయ్యే అవకాశం బాగా ఉంది.  అలాంటప్పడు చిన్నపాటి వైబ్రేషన్ తో తగ్గుముఖం పడతాయని యూనివర్శిటీ ఆఫ్ ఇల్లినోయిస్ లో తిమోతి కో చెప్తున్నారు. 

ముప్ఫై రోజులపాటు రోజుకి అరగంట సేపు చిన్నపాటి వైబ్రేషన్ ని కలిగించినట్లయితే గాయాలు నయమవటానికి అవసరమైన టిస్యూ ఏర్పడతాయని పరిశోధనలో తేలింది.  ఎముకలకు సంబంధించిన లోపాలు వైబ్రేషన్ తో నయమవుతాయని ఇప్పటికే తేలింది.  అదే విధానంలో డయాబెటిస్ ని కూడా నియంత్రించవచ్చేమోనని పరిశోధనలు జరుగుతున్నాయి. 

శంఖులో పోస్తేనే కాని తీర్థం కానట్లుగా, ఆధునిక శాస్త్రవేత్తలు చెప్తేనే కాని మనం ఒప్పుకోని స్థితికి వచ్చాం.  యోగా ఆయుర్వేద పద్ధతులలో చేసేది కూడా అదే, అప్పడు వాటిని బోధించినవారు కూడా ఆ కాలంలో శాస్త్రవేత్తలే.  ఎక్కడి వరకో అవసరం లేదు.  దెబ్బ తగలగానే మనకి తెలియకుండానే మనం చేత్తో దెబ్బ తగిలిన ప్రదేశంలో చేతితో చమురుకోవటం చేస్తుంటాం.  దానితో ఉపశమనం కలగటం కూడా మనం చూస్తాం. 

దీనికి కారణం మన శరీరంలోని హార్డ్ వేర్ లో హీలింగ్ అనే ప్రక్రియ.  మన శరీరంలోని రక్తప్రసరణ, గుండె కొట్టుకోవటం, కిడ్నీ లివర్ లు పనిచెయ్యటం లాంటివి ఎలా ఆ హార్డ్ వేర్ ప్రోగ్రాంలో ఉన్నాయో అలాగే శరీరంలో ఉష్ణాన్ని సమానంగా ఉండేట్టు చూడటం, శరీరంలో ఏ భాగమైనా సరిగ్గా పనిచెయ్యకపోతే అక్కడికి శక్తిని పంపించి దాన్ని నయం చెయ్యటం కూడా ఉన్నాయి.  చిన్న చిన్న గాయాలు వాటంతట అవే నయం కావటానికి అదే కారణం.  మామూలు సందర్భాలలో రక్తంలోని రోగనిరోధక కణాలు ఆ పని చేస్తాయి కానీ చక్కెర వ్యాధిగ్రస్తుల రక్తంలో ఆ గుణం తగ్గిపోవటం వలన గాయం నయం కావటానికి సమయం పడుతుంది. 

అయితే శరీరంలోపల సామాన్యంగా నయం కాని వ్యాధులను నయం చేసుకోవటానికి యోగాలో కృత్రిమంగా సున్నితమైన వత్తిడిని కలిగించే శరీరంలోని శక్తి ఆ ప్రదేశానికి చేరుకునేట్టుగా చెయ్యటం జరుగుతుంది.  యోగాసనాలలో వివిధ ప్రాంతాలకు శక్తి చేరుకునేట్టుగా చేసి ఆయా శరీర భాగాలు సమర్థవంతంగా పనిచేసే విధంగా చెయ్యటం జరుగుతుంది.  అలాగే ప్రాణాయామంలో కూడా శరీరంలో వివిధ ప్రాంతాలలో శక్తి తరంగాలు వైబ్రేషన్కలిగేట్టుగా చెయ్యటం జరుగుతుంది. 

అందువలన, వైబ్రేషన్ తో శరీరంలో వివిధ వ్యాధులను నిరోధించవచ్చు, వ్యాధి సోకితే వాటిని తగ్గించవచ్చని యోగ శాస్త్రం మనకు చెప్తుంది.  కానీ వచ్చిన సమస్యంతా ఏమిటంటే, చాలా మందికి తమ జీవన వేగంలో యోగాభ్యాసం చెయ్యటానికి సమయం లేదు. అలాంటివారికి వైబ్రేషన్ థెరపీ మంచిదే!

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Arasavalli surya temple about sun
Deep 71 quake rattles colombia  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles