Missing malaysian plane diverted course

Missing Malaysian plane diverted course, Malaysian flight 370 missing, Kuala Lumpur to Beijing plane

Missing Malaysian plane diverted course, Malaysian flight 370 missing, Kuala Lumpur to Beijing plane

గల్లంతైన మలేషియా విమానం దారి మళ్ళింపు

Posted: 03/18/2014 10:56 AM IST
Missing malaysian plane diverted course

మార్చి 8 న ఉదయం ఆరు గంటలకు చైనా లోని బీజింగ్ కి చేరుకోవలసిన 239 మందితో ప్రయాణం చేస్తున్న విమానం ఆచూకీ తెలియకుండా పోయి ఎన్నో దేశాలు ఆకాశంలోను, సముద్రం లోను గాలింపు మొదలుపెట్టినా ఇంతవరకు ఎటువంటి ఆచూకీ తెలియలేదు, దర్యాప్తు కూడా ముందుకు సాగలేదు.  నకిలీ పాస్ పోర్ట్ లతో విమానంలోకి ఎక్కిన గుర్తు తెలియని ప్రయాణీకుల విషయం బయటపడటంతో విమానం అపహరణకు గురవటానికి కూడా అవకాశమున్నదని కూడా అధికారులు భావిస్తూ వచ్చారు.  కానీ ఏ ఉగ్రవాద సంస్థ కూడా ఆ విమానాన్ని అపహరించినట్లుగా ప్రకటించలేదు.

తాజాగా దొరికిన చిన్న క్లూ తో అపహరణకు అవకాశం ఉందని తెలుస్తోంది.  అదేమిటంటే, విమానంలోని కంప్యూటర్ లో విమాన దిశను మార్చినట్లుగా తెలియవస్తోంది.  బీజింగ్ కి చేరకముందు విమానం దిశను అందులోని కంప్యూటర్ సాయంతో పడమర వైపుగా మళ్ళించినట్టుగా తెలిసింది.  దిశ మారటమైతే రూఢి అవుతోంది కానీ విమాన చోదకంలో అనుభవమున్న వారు మాత్రమే చెయ్యగలిగే ఆ పనిని ఎవరు చేసారు, ఎప్పుడు చేసారు అన్నది తెలియవలసివుంది.  అంటే విమానం మొదలైనప్పుడే దాని ప్రయాణాన్ని అలా నిర్దేశించారా లేకపోతే మధ్యలో మార్చటం జరిగిందా అన్నది తేలితే దానికి బాధ్యులెవరైవుంటారన్న దానిలో మరింత స్పష్టత ఏర్పడవచ్చు. 

కో పైలట్ ఆఖరి సారిగా గ్రౌండ్ కంట్రోల్ తో మాట్లాడే సమయంలో ఎయిర్ క్రాఫ్ట్ కమ్యూనికేషన్స్ అడ్రసింగ్ అండ్ రిపోర్టింగ్ సిస్టమ్ (ఎసిఎఆర్ఎస్) ను డిస్కనెక్ట్ చెయ్యటం జరిగిందని తెలిసింది.  అంటే గల్లంతైన మలేషియన్ 370 లోని ఎసిఎఆర్ఎస్ డిస్కనెక్ట్ కావటానికి పూర్వమే విమాన దిశను మార్చటం జరిగుండాలని యుఎస్ అధికారులు అంటున్నారు.  తమ నిర్దేశిత దిశ నుంచి పైలట్లు సామాన్యంగా వాతావరణంలోని మార్పుల వలన అందిన ఆదేశాలను బట్టి ఆ విధంగా దిశను మార్చుకుంటుంటారు.  .  ఈ పని ఎవరు చేసినా వాళ్ళు బోయింగ్ 777 మీద సాంకేతిక పరిజ్ఞానం కలిగివుండాలని కూడా నిర్ధారణ జరుగుతోంది. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles