Nalgonda student in kharagpur iit commits suicide

Nalgonda student in Kharagpur IIT committs suicide, IIT student Sravan Kumar, Sravan Kumar from Nalgonda suicide at Kharagpur

Nalgonda student in Kharagpur IIT commits suicide

నల్గొండ ఐఐటి విద్యార్థి ఖరగ్ పూర్ లో ఆత్మహత్య

Posted: 03/18/2014 10:11 AM IST
Nalgonda student in kharagpur iit commits suicide

ఐఐట్ విద్యార్థి నల్గొండకు చెందిన బోగా శ్రవణ్ కుమార్ ఖరగ్ పూర్ లో తను ఉంటున్న హాస్టల్ లో ఫ్యాన్ కి ఉరిపోసుకుని చనిపోయారు.  రాజుపేట మండలం రఘునాధపురంలో పేద చేనేత కార్మికుల ఇంట్లో జన్మించిన శ్రవణ్ కుమార్ ఖరగ్ పూర్ ఐఐటి లో ఎమ్ టెక్ రెండవ సంవత్సరం చదువుతున్నారు. 

పోలీస్ అదనపు కమిషనర్ బి.చంద్రశేఖర్, ప్రాధమిక దర్యాప్తులో ఫైనల్ యియర్ లో జరిగిన క్యాంపస్ సెలక్షన్స్ లో శ్రవణ్ కుమార్ కి ఉద్యోగం లభించింది కానీ అతను ఆశించిన పెద్ద ఉద్యోగం కాకపోవటంతో మనస్తాపం చెందాడని తెలిసిందని అన్నారు. 

శ్రవణ్ తండ్రి యాదగిరి కూడా ఈ విషయాన్ని విన్నానని అన్నారు.  ముందు శ్రవణ్ ఆరోగ్యం బాగోలేదని పిలిపించి, ఆ తర్వాత ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని తెలియజేసారని యాదగిరి అన్నారు.   పోలీసు దర్యాప్తుజరుగుతుండటం వలన ఈ విషయంలో రిపోర్ట్ వచ్చేంత వరకు ఎటువంటి ఊహాగానాలకు చోటివ్వటం ఇష్టం లేదని రిజిస్ట్రార్ ఘోషాల్ అన్నారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles