Location of high court in residual andhra pradesh

Location of High Court in residual Andhra Pradesh, Guntur Bar Association, Vijayawada Bar Association, State Bar Council, High Court in Guntur, HC Benches in coastal Andhra and Rayalaseema

Location of High Court in residual Andhra Pradesh

శేషాంధ్రప్రదేశ్ లో సర్వోన్నత న్యాయస్థానం ఎక్కడ?

Posted: 03/18/2014 12:03 PM IST
Location of high court in residual andhra pradesh

తెలంగాణా ప్రాంతాన్ని కత్తిరించిన తర్వాత మిగిలిన ఆంధ్రప్రదేశ్ లో హైకోర్టుని ఎక్కడ స్థాపించాలన్న విషయంలో ఏకాభిప్రాయం ఇంకా కుదరలేదు. 

రాష్ట్ర విభజన అనివార్యమని తెలియగానే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి హైకోర్టు కోసం ప్రదేశాన్ని నిర్ణయించటం చారిత్రక అవసరమని అన్నారు. 

1954 నుండి 1956 వరకు హైకోర్టు గుంటూరులో ఉండటం వలన మళ్ళీ అక్కడికే మార్చాలని గుంటూరు బార్ అసోసియేషన్ కోరుతోంది.  కానీ న్యాయవాదులలో చాలామంది విజయవాడలో హైకోర్టు ఉండాలని కోరుకుంటున్నట్లుగా తెలుస్తోంది.  బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎమ్ జయకర్ ఉద్దేశ్యంలో, గుంటూరులో ఇరుకు ఎక్కువ.  హైకోర్టు కోసం పెద్ద జాగా దొరకటం కష్టం, పైగా యాక్టివిటీ చూస్తే విజయవాడలోనే ఎక్కువగా ఉంటుంది. 

విజయవాడ గుంటూరు మధ్యలో హైకోర్టు ఉండాలని కూడా న్యాయవాదులు 2010 లో 100 రోజులపాటు డిమాండ్ చేసారు. 

అయితే, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు వి.బ్రహ్మారెడ్డి గుంటూరులో హైకోర్టు, కోస్తా ఆంధ్రా, రాయలసీమలలో రెండు బెంచ్ ల స్థాపన కోసం ప్రభుత్వాన్ని కోరుతూ వచ్చారు.  ఒక ప్రాంతంలో హైకోర్టు స్థాపిస్తే ఇతర ప్రాంతాల్లోని వారు దాన్ని వ్యతిరేకిస్తారని, అందువలన 22 మంది జడ్జ్ లకు, లైబ్రరీకి, పార్కింగ్ కి కావలసినంత సౌలభ్యమున్న గుంటూరులో హైకోర్టు స్థాపన చేస్తే మంచిదని సోమవారం మీడియా సమావేశంలో బ్రహ్మారెడ్డి అన్నారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles