Hitex area in chaos with flooding pawan fans

hitex area in chaos with flooding Pawan fans, Pawan Kalyan political party, Pawan kalyan Janasena party, Pawan Kalyan party Hitex auditorium, Pawan fans throng hitex

hitex area in chaos with flooding Pawan fans

హైటెక్స్ లో పవన్ ఫ్యాన్స్ తొక్కిసలాట

Posted: 03/14/2014 02:46 PM IST
Hitex area in chaos with flooding pawan fans

కేవలం నాలుగువేల మందికే పాస్ లు ఇచ్చాం వారినే అనుమతిస్తామని పోలీసులు రెండు రోజులు ముందు నుంచే చెప్తున్నా పవన్ కళ్యాణ్ పార్టీ ఆవిర్భావ సభను ప్రత్యక్షంగా చూడటానికి పాస్ లతో సంబంధం లేకుండా ఖమ్మం, గుంటూరు, బళ్ళారి, ఇతర సుదూర ప్రాంతాల నుంచి వస్తుంటే పోలీసులకు నియంత్రించటం కష్టమౌతోంది. 

దయచేసి పాసులు ఉన్నవాళ్ళే లోపలకు రండి మిగిలిన వాళ్ళు పెద్ద స్క్రీన్ లలో ప్రత్యక్ష ప్రసారాలను వీక్షించండంటూ కార్యక్రమ నిర్వాహకులు, పోలీసులు మళ్ళీ మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా పవన్ కళ్యాణ్ ఫ్యాన్లు అధిక సంఖ్యలో హైటెక్స్ ఆడిటోరియం దగ్గర చేరుకుంటున్నారు. 

7000 పాస్ లను జారీ చేసామని నిర్వాహకులు చెప్తున్నారు, 4000 కంటే ఎక్కువ మందిని అనుమతించబోమని పోలీసులు అంటున్నారు.  హైటెక్స్ ప్రాంతమంతా గందరగోళ పరిస్థితి నెలకొనివుంది. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles