Varun tej twitter story board

Varun Tej twitter story board of donkey, donkey story of current politics, Mega family hero Varun Tej

Varun Tej twitter story board of donkey

వరుణ్ తేజ్ ట్విట్టర్లో గాడిద కధనం

Posted: 03/14/2014 02:26 PM IST
Varun tej twitter story board

మెగా సినీ వారసుడు వరుణ్ తేజ్ ట్విట్టర్ వాల్ లో గాడిద కథనాన్ని అప్ లోడ్ చేసారు.  ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఎలా తయారైనాయో అది చాలా చక్కగా తెలియజేస్తుంది.  రాజకీయాలలో ఎవరేం చేసినా తప్పు పట్టేవాళ్ళుంటారు, ఏమీ చెయ్యకపోయినా అంతే. 

అందులో ఇద్దరు భార్యాభర్తలు గాడిద మీద పోతుంటారు.  అది చూసినవాళ్ళు, ఇద్దరు ఎక్కారు ఒక జంతువు మీద ఎంత అమానుషం అని అంటారు.  భర్త కిందికి దిగుతాడు.  అది చూసి, మూర్ఖుడు కాకపోతే భార్యను ఒంటరిగాగాడిద మీద సవారీ చేయిస్తాడా అని అంటారు.  అతను భార్యను దింపి తను ఎక్కుతాడు.  అప్పుడు క్రూరుడు కాకపోతే తను చక్కగా ఎక్కి కూర్చును భార్యను నడిపిస్తున్నాడు అంటారు.  తను కూడా దిగుతాడు.  పిచ్చోళ్ళు కాకపోతే గాడిద ఉన్నా ఉపయోగించుకోవటం తెలియదు అని అంటారు. 

రాజకీయాల్లో కూడా అంతే.  ఏదైనా ఘటన జరిగినప్పుడు ఇంత జరుగుతుంటే ఫలానా నాయకుడు ఏం చేస్తున్నారు అని అడుగుతారు.  ఆ నాయకుడే గనక అక్కడుంటే జరిగిన ఘటనను రాజకీయం చేస్తున్నారంటారు.  ఇలాంటి వ్యాఖ్యలు ఇతర పార్టీ నాయకుల నుంచే కాదు ఒక్కోసారి సొంత పార్టీ నాయకుల నుంచి కూడా వస్తుంటాయి.  అవి వాళ్ళ వ్యాఖ్యానాలలా కాకుండా ప్రజలు అనుకుంటున్నారు, రాజకీయాలను దిగజార్చుతున్నారు, ప్రజలు అంతా గమనిస్తూనేవున్నారు, ప్రజలేమీ మోసపోరు, ప్రజల మనోభావాలు ఇలా ఉంటాయి, ప్రజలు ఛీ గొడతారు అంటూ కూడా వ్యాఖ్యానాలు చేస్తుంటారు. 

రాజకీయాలతో దీనికి సంబంధం లేదని అంటున్నా, కంగ్రాట్స్ వరుణ్, చాలా చక్కటి సమకాలీన రాజకీయలకు సరిపోలే కథను సరైన సమయంలో గుర్తు చేసారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles