పవర్ స్టార్ గా పేరుగాంచిన తెలుగు సినీ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ రోజు సాయంత్రం రాజకీయ పార్టీని ప్రకటించబోతున్న సందర్భంగా కార్యక్రమాలు ఈ విధంగా ఉంటాయి.
పవన్ కళ్యాణ్ అన్న, మెగాస్టార్, కేంద్ర పర్యాటక శాఖామాత్యులు చిరంజీవి పార్టీ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. హైటెక్స్ ఆడిటోరియంలో 7000 వరకు అధికారికంగానే పాస్ లు జారీచేసిన సభలో చిరంజీవి పార్టీ ఉద్దేశ్యాలను వివరిస్తారు.
సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభమయ్యే పవన్ కళ్యాణ్ ప్రసంగాన్ని నోవోటెల్ ఎక్స్ పో ద్వారా పవన్ కళ్యాణ్ బృందం ప్రత్యక్షప్రసారం చేస్తుంది. హైద్రాబాద్ తో సహా రాష్ట్రంలో 28 ప్రాంతాల్లో ఏర్పరచిన పెద్దసైజు స్క్రీన్ మీద పవన్ కళ్యాణ్ సినీ రాజకీయ అభిమానులంతా దాన్ని వీక్షించగలుగుతారు.
మీడియా, కార్ పాస్ లను బార్ కోడ్ తో జారీచేసారు. దాని ప్రకారం ఆహ్వనితులందరి సీట్లూ రిజర్వ్ చెయ్యబడతాయి.
పార్టీ గుర్తింపుకు, ఎన్నికల చిహ్నం కేటాయింపుకు సమయం తక్కువగా ఉండటం వలన ఎన్నికల కమిషన్ నుంచి అనుమతి లభించటం కష్టం కాబట్టి ఈ సారి పోటీకి ఈ పార్టీ రాకపోవచ్చని, అయితే అధికారికంగా పోటీ చెయ్యకపోయినా, వారి అభ్యర్థులు స్వతంత్ర అభ్యర్థుల హోదాలో పోటీ చెయ్యటానికి అవకాశం ఉంటుందని కూడా ఊహాగానాలు వినవస్తున్నాయి.
ఇప్పటి వరకు పార్టీ గురించి, పార్టీ లక్ష్యాలు, పతాకం వగైరా వివరాలన్నీ సినిమా ఫక్కీలో టీజర్లలా విడుదలయ్యాయి. దానితో విపరీతమైన క్రేజ్ వచ్చింది. కానీ అసలు ప్రకటన కోసం రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.
అయితే ఈ పార్టీ వలన తమ గణాంకాల్లో తేడాలొస్తాయని కొన్ని పార్టీలు వేదన చెందుతున్నట్లుగా కూడా కనిపిస్తోంది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more