Police seized saris worth 30 lakh rupees

Police seized saris worth 30 lakh Rupees, Saris for distribution in elections, Money liquor and presents to attract voters, crores of rupees seized in 2014 elections

Police seized saris worth 30 lakh Rupees

పోలీసులకు లభించిన 30 లక్షల విలువైన చీరలు

Posted: 03/14/2014 01:39 PM IST
Police seized saris worth 30 lakh rupees

ఎన్నికల ప్రకటన జరిగిన తర్వాత, ఎన్నికల కోడ్ అమలు లోకి వచ్చిన తర్వాత ప్రత్యేక నిఘా వేసిన పోలీసులకు రాష్ట్ర వ్యాప్తంగా ఇంతవరకు తరలిస్తున్న కోట్లాది రూపాయలు పట్టబడ్డాయి.  డబ్బు, మద్యం ఎర చూపి వోట్లు దండుకోవచ్చన్న ప్రజాప్రతినిధుల ప్రయత్నాలను అడ్డుకుంటూ వచ్చిన పోలీసులకు పశ్చిమ గోదావరి జిల్లాలో చీరెలు లభించాయి. 

భీమవరం మండలం వెంపలో ఒక గోదాములో 30 లక్షల రూపాయల విలువైన చీరెలను వోటర్లకు పంపిణీ చెయ్యటం కోసం భద్రపరచారన్న సమాచారం అందుకున్న మొగల్తూరు పోలీసులు దాడిచేసి వాటిని అదుపులోకి తీసుకున్నారు. 

మొత్తం 228 బండిల్స్ లో ఉన్న ఆ చీరెలను పోలీస్ స్టేషన్ కి తరలించటానికి ఏడు ట్రాక్టర్లు కావలసివచ్చింది.  ఒక పార్టీకి చెందిన ఎంపీ వీటిని మహిళా వోటర్లను ఆకర్షించటం కోసం పంపిణీ చెయ్యటానికి పెట్టుకున్నారని తెలిసింది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles