Venkaiah naidu public meeting at tirupati

Venkaiah Naidu public meeting at Tirupati, Bharatiya Janata Party, BJP Venkaiah Naidu, Venkaiah Naidu, Seemandhr tour of Venkaiah, Venkaiah Naidu Rajyasabha member

Venkaiah Naidu public meeting at Tirupati

వెంకన్న నగరిలో వెంకయ్యనాయుడు ప్రసంగం

Posted: 03/10/2014 10:27 AM IST
Venkaiah naidu public meeting at tirupati

భారతీయ జనతా పార్టీ బాధ్యతను సీమాంధ్రలో భుజాన వేసుకున్న ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు వెంకయ్యనాయుడు ఆఖరు రోజు రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీతో పోరాడి సీమాంధ్రకు న్యాయం చేసే నాయకుడిగా పేరు తెచ్చుకుని, ఆ పేరుతో సీమాంధ్రలో పర్యటిస్తూ భాజపాకు ఆ ప్రాంతంలో మద్దతును పెంచే దిశగా కృషిచేస్తున్నారు.

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలంగాణాలో పార్టీ ప్రాబల్యానికి కృషి చేస్తుండగా సీమాంధ్రలో వెంకయ్యనాయుడు పనిచేస్తూ భాజపా నాయకులు రాష్ట్రాన్ని పంచుకున్నారు. 

ఈ ప్రయత్నంలో భాజపా నాయకుడు వెంకయ్యనాయుడు సభకు తిరుపతిలో ఘనమైన ఏర్పాట్లు జరిగాయి.  నెహ్రూ ఉన్నత పాఠశాల మైదానంలో 11.00 గంటలకు ప్రారంభమయ్యే ఈ సభకు పూర్వం రేణుగుంట చేరుకున్న వెంకయ్యనాయడు 300 కార్లతో ర్యాలీగా బయలుదేరుతారు.  రామానుజ కూడలి నుండి 500 ద్విచక్ర వాహనాలతో సభాస్థలికి చేరుకుంటారు. 

సీమాంధ్రలో పెద్దగా పట్టులేని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర విభజనలో పెద్ద పాత్రను పోషించి కూడా సీమాంధ్ర జనాగ్రహాన్ని తగ్గించే ప్రయత్నంలో పడింది. భారత ప్రధాని మోదీ అనే భాజపా కార్యక్రమంలో భాగంగా ఆదివారం నెల్లూరులో ప్రసంగించిన వెంకయ్యనాయుడు, కాంగ్రెస్ ప్రభుత్వం పది సంవత్సరాలలో ఏమీ చెయ్యలేదని, సహజవనరులతో సుసంపన్నమైన భారతావనిలో పటిష్టమైన ప్రభుత్వం లేకపోవటం వలనే అభివృద్ధి జరగలేదని అన్నారు.   అందువలన ఆ పార్టీని ఏరేసే సమయం వచ్చిందన్నారు వెంకయ్య.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles