Bjp public meeting marking telangana formation

BJP Public meeting marking Telangana Formation, BJP National President Rajnath Singh, BJP leader Arun Jaitley, BJP State President Kishan Reddy

BJP Public meeting marking Telangana Formation

తెలంగాణా ఆవిర్భావ సభ

Posted: 03/08/2014 09:29 AM IST
Bjp public meeting marking telangana formation

ఈ నెల 11న తెలంగాణా ఆవిర్భావ సభను భారతీయ జనతా పార్టీ నిజాం కాలేజ్ మైదానంలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తోంది. 

ఒకపక్క కాంగ్రెస్ పార్టీ, మరో పక్క తెలంగాణా రాష్ట్ర సమితి తెలంగాణా ఏర్పాటుకు వారి కృషి పట్టుదలలే కారణమని చెప్తూ వస్తున్న సందర్భంగా ఈ విషయంలో వెనకపడిపోదలచుకోని భాజపా వీలనప్పుడల్లా తమ మద్దతు లేకుండా తెలంగాణా రాష్ట్రం వచ్చుండేది కాదని చెప్తూ వస్తున్నా, బహిరంగ సభ ఏర్పాటు చేసి ఈ విషయాన్ని ప్రజల మనసుల్లోకి బాగా ఇంకేలా చెయ్యాలన్న ఆలోచనతో ఆ రోజు భాజపా జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్, సీనియర్ నాయకుడు అరుణ్ జైట్లీ తదితరులతో బ్రహామండమైన ఏర్పాట్లను చెయ్యాలని సంకల్పించుకుంది.

తెలంగాణా ఆవిర్భావ సభ కార్యక్రమం గురించి తెలియజేసిన రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావ ప్రకటన జరిగిన తర్వాత రాజ్ నాథ్ సింగ్ మొదటిసారిగా హైద్రాబాద్ వస్తున్న సందర్భంగా ఈ సభను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.  తమ వలనే తెలంగాణా వచ్చిందన్న అపోహను కలిగిస్తున్న కాంగ్రెస్ తెరాసల వాదాన్ని తిప్పికొట్టటమే కాకుండా దాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళటమే సభ ఉద్దేశ్యమని అన్నారాయన. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles