Congress party more helpless with kiran kumar party

Congress party more helpless with Kiran Kumar party, Migrations from Congress party in large scale, Telug Desam party, YSRCP, Congress party dilemma with migrations

Congress party more helpless with Kiran Kumar party

కిరణ్ కుమార్ పార్టీతో మరింత నిస్సహాయ స్థితిలో కాంగ్రెస్ పార్టీ

Posted: 03/08/2014 10:19 AM IST
Congress party more helpless with kiran kumar party

ఎగిరిపోతున్న పక్షులను నిస్సహాయంగా చూస్తున్న ఆకులు రాలిన చెట్టులా తయారైంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి.  కాంగ్రెస్ పార్టీలోంచి వలసలను నిలువరించటానికి ఏం చెయ్యాలో పాలుపోని పరిస్థితిలో కాంగ్రెస్ అధిష్టానం నివ్వెరపోయి చూడటం తప్ప మరేమీ చెయ్యలేకపోతోంది.

తెలుగు దేశం పార్టీ, వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలలోకే అంటే ఇప్పుడు కిరణ్ కుమార్ పార్టీలోకి కూడా కాంగ్రెస్ నాయకులు వలసలు పోతున్నారు.  తెదేపాలోకి ఇప్పటికే గంటా శ్రీనివాసరావు, టిజి వెంకటేష్ లాంటి సీనియర్లు వెళ్ళిపోగా, శుక్రవారం నర్సాపూర్ ఎమ్మల్యే కొత్తపల్లి సుబ్బారాయుడు, తణుకు ఎమ్మెల్యే కె.నాగేశ్వరరావు, ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే సురేష్ లు వైకాపా అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ని కలిసి తాము వైకాపాలో చేరటానికి సిద్ధమని చెప్పారు. 

ఇది ఇలా ఉండగా కొత్తగా పెట్టబోతున్న కిరణ్ కుమార్ పార్టీ లోకి ఎమ్మెల్యేలు జి.వీరశివారెడ్డి, జి.కుతూహలమ్మ, కొర్ల భారతి, పాముల రాజేశ్వరి చేరటానికి సిద్ధమని తెలియజేసారు.

అయితే, అంతా స్వయంకృతమేనని, ఇలా జరుగుతుందని కిరణ్ కుమార్ రెడ్డి ముందుగానే చెప్పినా విననందుకు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు లోలోపలే మధన పడుతున్నట్లుగానే సమాచారం.  తెరాస విలీనానికి ముందుకు రాకపోవటంతో ఆ బాధ మరీ ఎక్కవైనట్లుగా కనిపిస్తోంది. 

అందువలన తెలంగాణాతో పాటు సీమాంధ్రలో కూడా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ పర్యటించాలని, కాంగ్రెస్ పార్టీ మరింత బలహీనపడకుండా చూడాలని నిర్ణయించుకున్నారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles