Kiran kumar last moment orders cancelled by governor

Kiran Kumar last moment orders cancelled by Governor, Former CM Kiran Kumar Reddy favors, Governor cancels CM orders, President rule

Kiran Kumar last moment orders cancelled by Governor

కిరణ్ కుమార్ పోతూ పోతూ చేసిన మేళ్ళు రద్దు

Posted: 03/05/2014 09:03 AM IST
Kiran kumar last moment orders cancelled by governor

కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చెయ్యటానికి ముందు తీసుకున్న చర్యలను గవర్నర్ నరసింహన్ రద్దు చేసారు.

విశ్వాసపాత్రులైన కొంతమంది ప్రభుత్వ అధికారులకు కిరణ్ కుమార్ రెడ్డి చేసిన మేలు ప్రయోజనం లేకుండా పోయింది.  వారు కెఎస్ జవహర్ రెడ్డి, ఎన్ శ్రీధరరెడ్డి, ఎమ్.సురేందర్.

ఇర్రిగేషన్ అండ్ సిఏడి సెక్రటరీగా పనిచేస్తున్న జవహర్ రెడ్డిని, ఏ.పి బివిరేజెస్ కార్పోరేషన్ ఎండీ శ్రీధరరెడ్డిని ఆ పదవులలోంచి తీసివేయటం జరిగింది.  ఆదిత్యానాథ్ ఇర్రిగేషన్ అండ్ సిఏడి కి ప్రిన్సిపాల్ సెక్రటరీ బదిలీని రద్దు చేసి ఆయన పోస్ట్ లోనే ఉంచటం, పిఆర్, ఆర్డి ప్రిన్సిపాల్ సెక్రటరీ వి.నాగిరెడ్డిని ఇర్రిగేషన్ అండ్ సిఏడి ప్రిన్సిపాల్ సెక్రటరీగా నియమించటం జరిగింది. 

ఎమ్.సురేందర్ ని ఈ మధ్యకాలంలోనే కిరణ్ కుమార్ రెడ్డి అదనపు కోఆపరేటివ్ సొసైటీ పదవిలో నియామకం చేసారు.  ఆ నియామకాన్ని గవర్నర్ రద్దుచేసారు.  కిరణ్ కుమార్ చేసిన కొందరు ఐఏఎస్ బదిలీలను గవర్నర్ రద్దు చేస్తూ, సోషల్ వెల్ఫేర్ శాఖకు బదిలీ చేసిన జి.అనంతరాముని ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ గా నియమించారు. 

రాజీనామాకు ముందు కిరణ్ కుమార్ రెడ్డి హడావిడిగా చేసిన కొన్ని నిర్ణయాలను పరిశీలించవలసిందిగా గవర్నర్ కి అందిన కోరికల మేరకు గవర్నర్ వాటిని పరిశీలించి వాటిలో కొన్నిటిని రద్దు చేసారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles