Vijayashanti ready to resign for the sake of merger

vijayashanti ready to resign for the sake of merger, Viajayashanthi joins congress party, KCR, TRS party, Sonia Gandhi

vijayashanti ready to resign for the sake of merger

విలీనం కోసం త్యాగానికి సిద్ధమైన విజయశాంతి

Posted: 03/05/2014 08:11 AM IST
Vijayashanti ready to resign for the sake of merger

విలీనానికి కారణం నేనేనా అయితే నేను తప్పుకుంటా రండి.  మీరు విలీనం చేసుకోండి అంటూ విజయశాంతి తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖరరావుకి మీడియా ద్వారా పిలుపునిచ్చింది.  తెరాస నుంచి బహిష్కృత ఎంపీ విజయశాంతిని కాంగ్రెస్ పార్టీ లో చేర్చుకోవటం మీద అసహనాన్ని ప్రదర్శించి కెసిఆర్ తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చెయ్యకపోవటానికి అదొక కారణంగా చెప్పారు.  అందుకు మండిపడ్డ విజయశాంతి రాజకీయ నాయకుడు ఒక మాట మీద ఉండాలని, తెరాస నుంచి బయటకు వచ్చిన తర్వాత తాను మరే ఇతర పార్టీలోనూ చేరలేదని, తెలంగాణా రాష్ట్రాన్నిచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని తెరాసా మాటివ్వటం వలన ఆ పని కావటంతోనే తాను సోనియా గాంధీ ఆశీస్సులతో కాంగ్రెస్ పార్టీలో చేరానని చెప్పిన విజయశాంతి, అదే విలీనానికి అడ్డయితే తాను ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని, కెసిఆర్ నిక్షేపంగా విలీనం చేసుకోవచ్చని అన్నారు.

అంతే కాదు, మిగతా విషయాలలో కూడా తెరాస వైఖరిని కూడా ఎండగడుతూ, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్న కెసిఆర్ వాగ్దానం ఏమైందని, ఆ మాటెత్తితేనే కెసిఆర్ ధుమధుమలాడటమెందుకని ఆమె ప్రశ్నించారు.  తెరాసలో ఉన్నంతకాలం తనను ఇబ్బంది పెట్టి, నోటీసివ్వకుండానే తనను పార్టీలోంచి తొలగించారని విజయశాంతి ఆవేదనను వ్యక్తం చేసారు.  ఆశించిన తెలంగాణా రాష్ట్రం లభించలేదని అంటున్న కెసిఆర్ అంత ఆర్భాటంగా హైద్రాబాద్ లో గుర్రాలు ఒంటెలతో ఊరేగటమెందుకు చేసారని ప్రశ్నించారామె.

తెలంగాణా ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణా రాష్ట్రాన్నిచ్చిన కాంగ్రెస్ పార్టీ తనకో బాధ్యతను అప్పగించిందని, దాన్ని తాను పూర్తి చేస్తానని విజయశాంతి అన్నారు. 

అయితే విజయశాంతి కెసిఆర్ కి అడ్డేమీ కాదు.  విలీనం కోసం చూస్తున్న సమయంలో దాని గురించి పార్టీలో చర్చిస్తున్న తరుణంలో తమ పార్టీలోంచి బహిష్కరించిన సభ్యురాలిని చేర్చుకోవటం సరేనా అని ప్రశ్నించారు కెసిఆర్.  అది ఒక కారణం మాత్రమే, అదీ చాలా చిన్న కారణం.  ఇంకా ఎన్నో ప్రకటించిన, ప్రకటించని కారణాలున్నాయి.  అందువలన విజయశాంతి తనకు కాంగ్రెస్ అధ్యక్షురాలు ఇచ్చిన సభ్యత్వాన్ని త్యాగం చేసినంత మాత్రాన కెసిఆర్ కి పెద్దగా ఒరిగేదేమీ లేదని కూడా తెలుసు.  కానీ అస్తిత్వాన్ని కాపాడుకుంటూ ప్రాచుర్యాన్ని పొందాలంటే మీడియా ద్వారా ప్రకటనలు చెయ్యటం తప్పనిసరని రాజకీయ నాయకులందరికీ తెలిసిపోయింది. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles